Home / స్నాక్స్/ 🍯 హెల్తీ బెల్లం పూరి (Jaggery Puri) 💛

🍯 హెల్తీ బెల్లం పూరి (Jaggery Puri) 💛

March 31, 2026 2:26 pm
|
By

మన సంప్రదాయంలో బెల్లంతో చేసే స్వీట్స్ ప్రత్యేకమైనవి. ఈరోజు పూరిలను బెల్లంతో తయారుచేసుకుందాం. ఆరోగ్యకరమైన మల్టిగ్రైన్, బెల్లం‌తో తయారవుతుంది కాబట్టి ఈ పూరి టేస్టీగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి మంచిది 😋 ఈ రెసిపి టీ టైమ్ కి గాని, పిల్లలకు స్నాక్‌గా పర్ఫెక్ట్ 👍ఉంటుంది.

🛒 కావలసిన పదార్థాలు

  • మల్టిగ్రైన్ పిండి – 1 కప్
  • బెల్లం (తురిమినది) – ¾ కప్
  • యాలకుల పొడి – 1/4 టీ స్పూన్
  • నెయ్యి – 1 టేబుల్ స్పూన్
  • నీరు – తగినంత
  • నూనె – వేయించడానికి సరిపడా

    👩‍🍳 తయారీ విధానం

    🔥 స్టెప్ 1: ఒక గిన్నెలో బెల్లం తీసుకుని, కొంచెం నీరు కలిపి వేడి చేయాలి. బెల్లం పూర్తిగా కరిగిన తరువాత, వడపోసి పక్కన పెట్టాలి.
    🥣 స్టెప్ 2:  ఇప్పుడు పిండిని తీసుకుని అందులో యాలకుల పొడి వేసి కలపాలి. తరువాత బెల్లం నీరు పోస్తూ ముద్దలా కలపాలి. చివరగా నెయ్యి వేసి సాఫ్ట్ డోలా చేయాలి
    🫓 స్టెప్ 3: కలిపిన పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకుని, పూరీలు చేసుకోవాలి.
    🍳 స్టెప్ 4: నూనె వేడి చేసి మీడియం మంట పై పూరీలు వేయించాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేయాలి. వేడిగా ఉండగానే పూరీలను వడ్డించుకోవాలి.

    🍽️ సర్వింగ్ సూచనలు

    • ఈ పూరీలు వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది😍
    • పాలు లేదా టీతో సర్వ్ చేస్తే ఇంకా బాగుంటుంది