🐟 కావలసిన పదార్థాలు
-
చేప ముక్కలు – 250 గ్రాములు (రోహు / కట్లా / కొరమీను ఏదైనా సరే)
-
పసుపు – 1/4 టీ స్పూన్
- కారం పొడి – 1½ టీ స్పూన్లు
-
ఉప్పు – తగినంత
-
జీలకర్ర మెంతుల పొడి – 1/2 టీ స్పూన్
-
ధనియాల పొడి – 1 టీ స్పూన్
-
నిమ్మరసం – 1 టీ స్పూన్
-
గరం మసాల – 1/2 టేబుల్ స్పూన్
-
కొత్తిమీర – కొద్దిగా
- అల్లం–వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
-
నూనె – ఫ్రై చేయడానికి సరిపడా
🍽️ తయారీ విధానం
-
చేప ముక్కలను శుభ్రంగా కడిగి నీరు పూర్తిగా వడకట్టాలి.
-
ఒక బౌల్‌లో చేప ముక్కలు తీసుకుని వాటిపై పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాల, జీలకర్ర మెంతుల పొడి, అల్లం–వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసి కలిపి ముక్కలకు పూతలా పట్టించాలి.
-
ఈ మసాలలు పట్టించిన చేప ముక్కలను 10 నిముషాల పాటు పక్కన పెట్టాలి.
-
ఆ తరువాత పాన్‌లో నూనె వేసి వేడి చేసి, చేప ముక్కలను వేసి మీడియం మంట మీద నెమ్మదిగా ఫ్రై చేయాలి.
-
ఒక వైపు వేగిన తరువాత తిప్పి, రెండో వైపు కూడా వేగేదాక వేయించాలి.
-
చివర్లో కొత్తిమీర వేసి మరోసారి ముక్కలను తిప్పి, కొత్తిమీర వేగాక స్టౌవ్ ఆఫ్ చేయాలి. అంతే నోరూరించే ఉండే చేపల ఫ్రై రెడీ.
-
వేడి అన్నం లేదా రాగి సంగటి తో సర్వ్ చేస్తే అదిరిపోతుంది 🤍
-
