Home / స్వీట్స్/ 🌾 సున్నుండలు – ఆరోగ్యకరమైన సంప్రదాయ స్వీట్

🌾 సున్నుండలు – ఆరోగ్యకరమైన సంప్రదాయ స్వీట్

February 10, 2026 3:50 pm
|
By

పండగ అంటే సంతోషం… ఆ సంతోషానికి రుచి జోడించేది, ఇంట్లో చేసిన సున్నుండలు 🤍 సంప్రదాయ రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందించే స్వీట్ ఇది 😋

📝కావలసినవి :

  • మినప పప్పు – అర కేజీ

  • బెల్లం – పావు కేజీ

  • నెయ్యి – పావు కేజీ

    👩‍🍳 తయారుచేసే విధానం :

    1: మినప పప్పును తక్కువ మంట పై మంచి వాసన వచ్చే వరకు వేయించి పూర్తిగా చల్లారనివ్వాలి.

    2: చల్లారిన తరువాత మినప పప్పును బరకగా పొడిచేసుకోవాలి.

    3: ఆ పొడిలోనే బెల్లాన్ని చిన్న ముక్కలుగా చేసి వేసి, మళ్లీ గ్రైండ్ చేస్తే సన్నని మిశ్రమం తయారవుతుంది.

    4: నెయ్యిని కొద్దిగా వేడి చేసి మిశ్రమంలో పోసి బాగా కలపాలి.

    5: చేతికి అంటుకోకుండా నిమ్మకాయ పరిమాణంలో ఉండలుగా తయారుచేస్తే సున్నుండలు సిద్ధం 😋