📝 కావలసినవి :
-
🥕 బీట్రూట్ ముక్కలు – అర కప్పు
-
🌾 గోధుమ పిండి – ఒక కప్పు
-
🌶️ పచ్చి మిర్చి – 2
-
🧄 వెల్లుల్లి రెబ్బలు – 2
-
🌿 అల్లం – చిన్న ముక్క
-
🧂 ఉప్పు – తగినంత
-
🛢️ ఆయిల్ – తగినంత
👩🍳తయారు చేసే విధానం :-
1 : బీట్రూట్ ముక్కలు,పచ్చిమిర్చి,వెల్లుల్లి,అల్లం,చిటికెడు ఉప్పు, కొంచెం నీరు కలిపి ప్యూరిలా గ్రైండ్ చేసుకోవాలి.
2: వెడల్పాటి గిన్నెలో గోధుమ పిండిని తీసుకుని తగినంత ఉప్పు కలపాలి. తర్వాత గ్రైండ్ చేసిన బీట్రూట్ ప్యూరీ వేసి చపాతీ పిండిలా మృదువుగా కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీరు కలపవచ్చు.
3: పిండిలో ఒక టీ స్పూన్ నూనె వేసి బాగా కలిపి పది నిమిషాలు మూతపెట్టి పక్కన ఉంచాలి.
4:- పిండిని నిమ్మకాయ పరిమాణంలో ఉండలుగా చేసి చపాతీలుగా వత్తాలి. వేడెక్కిన పెనం పై నూనెతో లేదా నెయ్యితో రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. బంగాళాదుంప కూరతో కానీ పెరుగు చట్నీ తో బాగుంటుంది.
