Home / ఎగ్ లెస్/ 🍫 సాఫ్ట్ చాక్లెట్ కేక్ (విత్ అవుట్ ఓవెన్)

🍫 సాఫ్ట్ చాక్లెట్ కేక్ (విత్ అవుట్ ఓవెన్)

February 24, 2026 2:24 pm
|
By

ఇంట్లోనే ఓవెన్ తో పనిలేకుండా స్టవ్ పైనే సులభంగా చేసుకునే మెత్తటి స్పాంజీ చాక్లెట్ కేక్ తయారీ విధానం మీకోసం. తక్కువ పదార్థాలతో, పిల్లలు చాలా ఇష్టపడే చాక్లెట్ కేక్ ను మీరు ట్రై చేయండి.

🛒 కావలసినవి:

  • మైదా – 1 ½ కప్పు

  • కోకో పౌడర్ – 3 టేబుల్ స్పూన్లు

  • బేకింగ్ పౌడర్ – ½ టేబుల్ స్పూన్

  • పంచదార – ¾ కప్పు

  • నెయ్యి – ¼ కప్పు

  • పెరుగు – ¾ కప్పు

  • (ఐచ్చికం) పాలు – ¼ కప్ (మిశ్రమం గట్టిగా ఉంటే మాత్రమే)

    👩‍🍳 తయారు చేసే విధానం (స్టౌవ్ పద్ధతి)

    1. ఒక గిన్నెలో మైదా, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి ఒకసారి జల్లెడ పట్టాలి. ఇలా చేస్తే కేక్ మెత్తగా వస్తుంది.

    2. మరొక గిన్నెలో నెయ్యి మరియు పంచదార వేసి క్రీమీగా కలపాలి. తర్వాత పెరుగు వేసి బాగా బీట్ చేయాలి. మిశ్రమం స్మూత్‌గా మారుతుంది.

    3. ఇప్పుడు డ్రై మిక్స్‌ను కొంచెం కొంచెంగా వెట్ మిక్స్‌లో కలుపుతూ సున్నితంగా కలపాలి. మిశ్రమం ఎక్కువ గట్టిగా ఉంటే కొద్దిగా పాలు కలుపుకోవాలి.
    గడ్డలు లేకుండా, రిబ్బన్ లాంటి కన్సిస్టెన్సీ వచ్చేవరకు కలపాలి. మరీ ఎక్కువగా కలపకండి.

    🔥 స్టౌవ్‌పై బేక్ చేసే విధానం

    1. వెడల్పాటి, మందపాటి గిన్నెను స్టౌవ్‌పై పెట్టి, అందులో టేబుల్ సాల్ట్ వేసి  5–7 నిమిషాలు లో ఫ్లేమ్‌లో వేడి చేయాలి.

    2. దాని లోపల ఒక స్టాండ్ లేదా చిన్న ప్లేట్ పెట్టాలి.

    3. ఇప్పుడు కేక్ టిన్‌కు నెయ్యి లేదా నూనె రాసి కొద్దిగా మైదాను చల్లాలి.

    4. ఆ తరువాత టిన్‌లో రెడీ చేసి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని పోసి, 2,3 సార్లు తట్టాలి (టాప్ చేయాలి). దీనిని ముందుగా వేడి చేసిన గిన్నెలో స్టాండ్ పై ఉంచాలి.

    5. గిన్నె పై మూత పెట్టి పూర్తిగా కవర్ చేసి, చిన్న మంట పై 35–40 నిమిషాలు పెట్టాలి. అంతే నోరూరించే చాక్లెట్ కేక్ రెడీ.

    ✔ చెక్ చేసే విధానం:

    టూత్‌పిక్‌తో కేక్ ను గుచ్చి చూడాలి. ఏమీ అంటుకోకుండా వస్తే కేక్ సిద్ధం. గ్యాస్ ఆఫ్ చేసి 10 నిమిషాలు అలాగే ఉంచి, చల్లారిన తర్వాత బయటకు తీసుకోవాలి.

    🍰 సర్వింగ్ ఐడియా:

    కేక్ పైన కొంచెం చాక్లెట్ సాస్ లేదా పౌడర్ షుగర్ చల్లితే ఇంకా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.