టిఫిన్స్పిల్లల వంటకాలురోటీస్వెజ్

వాము పూరి/అజ్వైన్ పూరి

అజ్వైన్ పూరి | వాము పూరి. ఇది భారతీయ వంటకం.ఇది వాముతో రుచిగా ఉంటుంది.అజ్వైన్ పూరి చాలా సులభమైన వంటకం,ఇది గోధుమ పిండితో తయారుచేయబడి,పసుపు మరియు అజ్వైన్ తో రుచిగా ఉంటుంది.ఇది పూరీకి ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. దీనిని అల్పాహారం కోసం లేదా తేలికపాటి భోజనంగా తింటారు.

కావలసిన పదార్థాలు:-

తయారుచేయు విధానం:-

1

ఒక గిన్నెలో గోధుమ పిండి, వాము,పసుపు,ఉప్పు తగినన్ని నీళ్ళు పోసి చపాతీ పిండిలా కలపాలి.చివరలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి బాగా కలపాలి.

2

ఇప్పుడు పిండిని చిన్న చిన్న ఉండల లాగా చేసుకుని,వాటిని రోలింగ్ పిన్ ఉపయోగించి కొంచెం మందమైన పూరీలు చేయాలి.

3

కడాయిలో నూనె పోసి వేడి చేయాలి.నూనె వేడి అయిన తరువాత ఒక్కో పూరిని మెల్లగా వేసి అది నూనె పైకి వచ్చిన తరువాత గంటెతో కొంచెం కిందికి నొక్కండి,అలా చేయడం ద్వారా పూరీ పొంగుతుంది. తరువాత పూరీని తిప్పి, బంగారు గోధుమరంగు వచ్చేవరకు వేయించుకోవాలి. పూర్తయిన తర్వాత, అదనపు నూనెను గ్రహించడానికి కిచెన్ టవల్ లేదా టిష్యు పేపర్ మీద పెట్టండి

చిట్కా:-

నూనె వేడి అయినదో లేదో తెలుసుకోవడానికి, 5 నుండి 10 నిమిషాల తరువాత చిన్న పిండిముద్దని నూనెలో వేసినపుడు పిండి త్వరగా పైకి వస్తే నూనె వేడి అయినట్టు.
Show More

Leave a Reply

Back to top button
error: Content is protected !!