టిఫిన్స్పిల్లల వంటకాలురోటీస్వెజ్
ఆలూ పూరీ
ఆలూపూరీ రుచికరమైన అల్పాహార వంటకం.గోధుమ పిండిలో ఉడికించిన మెత్తని బంగాళాదుంపలుకలిపి తయారుచేస్తారు.ఈ పూరీలను పిల్లలు,పెద్దలుఇష్టపడతారు,అందువల్ల వారు ఈ మసాలా పూరీలను ఎక్కువగా ఆస్వాదిస్తారు.ఈ పూరీలు సాధారణపూరీల మాదిరిగానే తయారుచేయడం చాలా సులభం.మీ అతిథుల కోసం పండుగ సమయంలో తయారుచేసి,వారిని ఆశ్చర్య పరచండి.
కావలసిన పదార్థాలు:-
- గోధుమ పిండి : 2 కప్పులు
- బంగాళాదుంప : 2
- కొత్తిమీర : 2 టేబుల్ స్పూన్లు (మెత్తగ తరిగిన)
- కారం పొడి : ¼ స్పూన్
- వాము : ¼ స్పూన్
- మిరియాలపొడి:¼ స్పూన్
- పసుపు : చిటికెడు
- ఉప్పు : తగినంత
- నూనె : వేయించడానికి
తయారుచేయు విధానం:-
1
బంగాళా దుంపల్ని ఉడికించి మెత్తగా చేసుకోవాలి.
2
ఒక గిన్నెలో గోధుమ పిండి, ఉప్పు, మిరియాలపొడి,వాము,పసుపు,కొత్తిమీర,బంగాళా దుంపల ముద్ద వేసి పూరి పిండిలా కలుపుకోవాలి.
3
పిండితో చిన్న చిన్న ఉండలు చేసుకొని పూరీల్లా వత్తుకోవాలి.వీటిని రెండు వైపులా గోధుమరంగు వచ్చే వరకు నూనెలో వేయించుకోవాలి.
అంతే ఆలూపూరీ రెడీ,వీటిని ఆలూకర్రీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.
అంతే ఆలూపూరీ రెడీ,వీటిని ఆలూకర్రీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.
Tags
aloo puri aloo puri recipe Aloo Puri Recipe at home in telugu aloo puri recipe in telugu potato puri recipe Punjabi Aloo Puri Recipe Punjabi Aloo Puri Recipe in telugu Telugu Breakfast Recipes telugu healthy recipes Telugu recipe Website telugu recipes telugu tiffin recipes telugu vantalu Telugu Veg Recipes Puri