ఆపిల్ కేక్
కావలసిన పదార్థాలు:-
- మైదాపిండి: 1 1/2 కప్పులు
- తురిమిన ఆపిల్ : ముప్పావు కప్పు
- వెన్న/నెయ్యి : పావు కప్పు
- పెరుగు: అర కప్పు
- పంచదార : ముప్పావు కప్పు
- బేకింగ్ సోడ/వంటసోడ : అర టీస్పూన్
- బేకింగ్‌పౌడర్: అర టీస్పూన్
- దాల్చిన చెక్క పొడి : పావు టీ స్పూన్
తయారుచేయు విధానం:-
1
ముందుగా మైదా, బేకింగ్ పొడి, వంటసోడా, విడివిడిగా జల్లించి పెట్టుకోవాలి. తరువాత ప్రెజర్ కుక్కర్ అడుగున వెన్న లేదా నెయ్యితో రాసి మైదాపిండి చల్లి పక్కన పెట్టుకోవాలి.
2
ఓ గిన్నెలో నెయ్యి/వెన్న తీసుకొని బీట్ చేసుకోవాలి(గిలకొట్టాలి).తరువాత పంచదార,పెరుగు వేసి రంగు మారే వరకు బాగా బీట్ చేసుకోవాలి.
3
తరువాత బీట్ చేసుకున్న మిశ్రమంలో మైదా,బేకింగ్‌పౌడర్,బేకింగ్ సోడా వేసి బాగా కలపిన తరువాత ఆపిల్ తురుముని మరియు దాల్చిన చెక్క పొడిని వేసి బాగా కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని పిండి చల్లి ఉంచిన కుక్కర్‌లో పోసి మూతపెట్టాలి.విసిల్ పెట్టకూడదు.
4
తరువాత స్టవ్ పై నాన్ స్టిక్ పాన్ పెట్టి, దానిపై ప్రెజర్ కుక్కర్ పెట్టి, ముందు మూడు నిమిషాలు ఎక్కువ మంట మీద ఉంచి తరవాత సిమ్‌లో పెట్టి అరగంటసేపు ఉంచాలి.
5
౩౦ నిముషాల తరువాత టూత్ పిక్ కానీ చాక్ కానీ కేకు లో గుచ్చి చూడాలి.అది ఏమి అంటుకోకుండా ఉంటే స్టవ్ హాఫ్ చేసి, చల్లారిన తరువాత ప్లేట్లోకి తీసుకోవాలి.
రుచికరమైన ఆపిల్ కేక్ ని పిల్లలతో కలిసి ఆస్వాదించండి.