అరిసెలు
కావలసిన పదార్థాలు:-
- బియ్యం : అర కేజీ
- బెల్లం : అర కేజీ
- యాలకుల పొడి : అర టీ స్పూన్
- నెయ్యి : 2 టేబుల్ స్పూన్లు
- నూనె - వేయించడానికి సరిపడా
- నీళ్ళు : పావు కప్పు
తయారుచేయు విధానం:-
1
ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి 2-4 గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత నీళ్లు వడపోసి పలుచటి వస్త్రంలో పోసి ఆరబెట్టుకోవాలి.బియ్యం కొంచెం తడిగా ఉన్నప్పుడే మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి.
2
ఇప్పుడు ఒక అడుగు మందం ఉన్న వెడల్పాటి గిన్నెలో బెల్లం వేసి,కొన్ని నీళ్లు పోసి పాకం పట్టుకోవాలి.
3
ఒక ప్లేట్ లో నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి. పాకం ఉడికేప్పుడు, నీళ్లలో పాకం చుక్క వేస్తే కరిగిపోకుండా ఉండకట్టినప్పుడు ,పాకం వచ్చినట్టుగా భావించాలి.
4
ఇప్పుడు పాకంలో నెయ్యి వేసి కలిపి, స్టవ్ ఆపేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా పాకంలో వేస్తూ, నెమ్మదిగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి.
5
తరువాత ఈ మిశ్రమాన్ని నిమ్మకాయ పరిమాణంలో ఉండలుగా చేసుకుని అరటి ఆకుపైన కాని ,ప్లాస్టిక్ పేపర్ పై కాని గారెల మాదిరిగా చేసుకుంటూ నూనెలో వేసి వేయించుకోవాలి. రుచికరమైన , ఆరోగ్యకరమైన అరిసెలు రెడీ.
అరిసెలు పదిరోజుల వరకు తాజాగా ఉంటాయి