పిల్లల వంటకాలుస్వీట్స్

బీట్‌రూట్ బూందీ లడ్డు

బీట్‌రూట్ బూందీలడ్డు వినడానికి కొంచెం కొత్తగా ఉన్నప్పటికీ చాలా రుచికరంగా ఉంటాయి. ముఖ్యంగా బీట్రూట్ తినని వారికి పిల్లలకైన, పెద్దవారికైన ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు.బీట్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికి తెలిసిన విషయమే.వాళ్ళు తినట్లేదని వదిలేయకుండా వాళ్ళు తినేవాటిలోనే కొంచెం మార్పు చేసిపెడితే సరిపోతుంది. తియ్యని పదార్థాలు ఇష్టపడని వారెవరుంటారు.మా బాబు బీట్రూట్ తినడానికి ఇష్టపడడు. తనకెలా పెట్టాలా అని ఆలోచించినపుడు వచ్చిన వంటకమే ఈ లడ్డు.

కావలసిన పదార్థాలు:-

తయారుచేయు విధానం:-

1

ముందుగా బీట్ రూట్ ని పైన పొట్టుని తీసేసి,కొంచెం నీళ్ళు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

2

తర్వాత ఒక పాత్రలో శనగపిండితీసుకోని ఉప్పు,గ్రైండ్ చేసిన బీట్రూట్ వేసి జారుగా ఉండేట్టు కలుపుకోవాలి.ఉండలు కట్టకుండా బాగా కలపాలి.

3

ఆ తర్వాత కడాయిలో నూనె పోసి వేడెక్కాక బూందీలా వేసుకోవాలి.

4

ఇంకొక గిన్నెలో చక్కెర తీసుకుని,అందులో కొన్ని నీళ్ళు,యాలకులు వేసి తీగపాకం పట్టుకోవాలి.

5

తరువాత తీగపాకంలో బూందీని,కొంచెం నెయ్యి,వేయించిన జీడిపప్పు, ఎండుద్రాక్ష కూడా వేసుకుని బాగా కలిపి లడ్డూలు కట్టు కోవాలి.

చిట్కాలు:-

తడితగలకుండా ఉంటె వారం రోజులవరకు ఉంటాయి. మూత గట్టిగా ఉన్న టిఫిన్ డబ్బాలో పెట్టుకోవాలి.
తీగపాకం అంటే పాకాన్ని మరిగేప్పుడు కొంచెం తీసుకుని రెండు వేళ్ళతో పైకి కదిపినప్పుడు తీగలా వస్తే తీగ పాకం అంటారు.

-ఈ లడ్డులని పిల్లలు బాగా ఇష్టంగా తింటారు.

Show More

Leave a Reply

Back to top button
error: Content is protected !!