టిఫిన్స్పిల్లల వంటకాలురోటీస్
బీట్ రూట్ చపాతీ
బీట్‌రూట్ చపాతి అందంగా కనిపించే ఈ చపాతీ ఆరోగ్యకరమైనది మరియు తయారు చేయడం సులభం. బీట్‌రూట్ ప్యూరీ పిండికి చక్కని ఎరుపు రంగును ఇస్తుంది.ఇవి పిల్లలకు లేదా ఈ పోషకమైన కూరగాయను తినడానికి ఇష్టపడని పెద్దలకు సరైనవి. బీట్‌రూట్‌లో చాలా మందికి నచ్చని మట్టి రుచి ఉంటుంది. బీట్‌రూట్ చపాతీ తయారు చేయడం ద్వారా, ఆ రుచి గుర్తించలేరు. పిల్లలు దాని ఎరుపు రంగుతో ఆకర్షితులవుతారు మరియు వారు ఎటువంటి ఫిర్యాదు లేకుండా సంతోషంగా తింటారు.
కావలసిన పదార్థాలు:-
- బీట్రూట్ ముక్కలు : అర కప్పు
- గోధుమ పిండి :ఒక కప్పు
- వెల్లుల్లి రెబ్బలు : 2
- అల్లం : చిన్న ముక్క
- పచ్చి మిర్చి : 2
- జీలకర్ర : అర టీస్పూన్
- ఉప్పు : తగినంత
- నూనె : తగినంత
తయారుచేయు విధానం:-
1
బీట్రూట్ ముక్కలు,పచ్చిమిర్చి,వెల్లుల్లి,అల్లం,చిటికెడు ఉప్పు, కొంచెం నీరు కలిపి ప్యూరిలా గ్రైండ్ చేసుకోవాలి.
2
వెడల్పాటి గిన్నెలో పిండిని తీసుకుని తగినంత ఉప్పు వేసి కలిపి,గ్రైండ్ చేసుకున్న ప్యూరిని వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి.అవసరమైతే కొన్ని నీళ్ళు కలుపుకోవచ్చు.
3
ఒక టీ స్పూన్ వేసి, కలిపి పది నిముషాలు మూతపెట్టి పక్కన పెట్టాలి.
4
పిండిని నిమ్మకాయ పరిమాణంలో ఉండలుగా చేసుకుని ,చపాతీలు చేసుకుని రెండువైపులా నూనెతో కాని ,నెయ్యితో కానీ కాల్చుకోవాలి.
బంగాళాదుంపకూర తో కానీ పెరుగు చట్నీతో వడ్డించుకోవాలి.
Tags
Beetroot chapathi beetroot recipes beetroot recipes for kids beetroot recipes in telugu Dishes easy and quick recipes in telugu food healthy chapathi healthy recipes healthy recipes for kids in telugu Iron rich chapathi for kids Kids breakfast Kids snacks tasty chapathi telugu healthy recipes telugu kids recipes telugu recipes telugu recipes with beetroot beetroot recipes telugu vantalu Variety recipes డిషెస్ ఫుడ్ వెరైటీ వంటకాలు స్నాక్