టిఫిన్స్పిల్లల వంటకాలువెజ్

బీట్రూట్ దోశ

మనం రోజు తినే అల్పాహారం అదేనండీ బ్రేకఫాస్ట్ బోర్ కొట్టినపుడు లేదా పిల్లలు ఎప్పుడు ఇదే దోశ వేరే ఏమైనా చేయొచ్చుకదా అన్నప్పుడు కొంచెం కొత్తగా,అందులోనూ ఆరోగ్యకరమైన బీట్రూట్ దోశ వేసి మీ కుటుంబసభ్యులను ఆశ్చర్యపరచండి.
రెగ్యులర్ గా అయితే ఇలా ఇంట్లో టిఫిన్ బోర్ అనగానే బయటనుండి తెచ్చుకుంటారు. కానీ ఇంట్లో చేసిన తృప్తి రాదు. అదెలా చేశారో అన్న అనుమానాలు ఉంటాయి. పైగా ఇప్పుడన్న పరిస్తితుల్లో బయటికి వెళ్లలేము.
అదే మన ఇంట్లో చేసుకుంటే మన రోజువారీ ఖర్చుతోనే వెరైటీ మరియు టేస్టీ టిఫిన్ అందరు తినవచ్చు.
బీట్రూట్ అంటే చాలావరకు తినడానికి ఇష్టపడరు. ఆరోగ్యం కోసం తినేవారుంటారు కానీ అది కూడా తప్పదు అన్నట్టుగా కొంతమంది తింటారు. పిల్లల గూర్చి అయితే చెప్పనక్కరలేదు ఆ పేరు చెప్తేనే పరుగెత్తేవాళ్ళు చాలా మంది ఉంటారు.
కానీ బీట్రూట్ చాలా ఆరోగ్యకరమైనది. ఐరన్ ఎక్కువగా ఉంటుంది. పిల్లలు తినకపోతే వాళ్ళకి నచ్చేట్టుగా పెట్టాలే తప్ప,తినడం లేదుకదా అని వదిలేయకూడదు. పిల్లలు కంటికి నచ్చితే తినడానికి ఇష్టపడుతారు. వాళ్ళకి నచ్చే దోశనే కలర్ ఫుల్ గా పెట్టండి.

కావలసిన పదార్థాలు:-

తయారుచేయు విధానం:-

1

ముందుగా బీట్రూట్ ని కడిగి చిన్న ముక్కలుగా తరిగి మిక్సి జార్లో వేసి,అందులోనే పచ్చి మిర్చి, జీలకర్ర,అల్లం,వెల్లుల్లిపాయలు,పుదీన, ఉప్పు వేసి ప్యూరిలా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొన్ని నీళ్ళు కలుపుకోవచ్చు.

2

ఇప్పుడు దోశపిండిలో గ్రైండ్ చేసుకున్న ప్యూరిని వేసుకుని బాగా కలుపుకోవాలి. పిండి ఎర్రనిరంగులో ఆకర్షణీయంగా మారుతుంది.

3

దోశ పెనం మీద కొంచెం నూనె వేసి సగం కట్ చేసిన ఉల్లిపాయతో రుద్దాలి. ఇలా చేయడం వల్ల దోశలు పెనానికి అంటుకోకుండా చక్కగా వస్తాయి.

4

ఇప్పుడు మంటను హై లో పెట్టి, గరిటెతో దోశపిండి వేసి గుండ్రంగా తిప్పుతూ పెనం అంతా పరుచుకునేట్టు చేయాలి. దోశ చుట్టూ నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి.

5

నూనె వేసిన తరువాత మూతపెట్టి, రెండు నిముషాల తరువాత దోశను మడిచి ప్లేట్ లో పెట్టి మీకు నచ్చిన చట్నీతో ఆస్వాదించండి.ఈ బీట్రూట్ దోశలను పుదీనా చట్నీతో కానీ పల్లిల చట్నీతో కానీ వేడి వేడి గా తింటే చాలా రుచికరంగా ఉంటాయి.

మీకు నచ్చే మరిన్ని బీట్రూట్ వంటలు 

బీట్రూట్ బూందీ లడ్డు  

బీట్రూట్ పూరీ 

Show More

Leave a Reply

Back to top button
error: Content is protected !!