టిఫిన్స్పిల్లల వంటకాలురోటీస్

బీట్రూట్ పూరీ

బీట్రూట్ పూరీ | ఈరోజు మీముందుకి ఎన్నో పోషక విలువలు ఉన్న బీట్రూట్ ని సరికొత్త రూపంలో ముఖ్యంగా పిల్లల కోసం తీసుకొస్తున్నాను.పిల్లలు బీట్రూట్ ని తినడానికి ఇష్టపడరు.దాన్నిఎదో ఒక రూపంలో ముఖ్యంగా వాళ్ళు ఇష్టంగా తినే పద్దతిలో చేసి పెడితే లొట్టలు వేసుకుంటు తింటారు. ఆ ఆలోచన తో తయరైందే ఈ బీట్రూట్ పూరీ.

కావలసిన పదార్థాలు:-

తయారుచేయు విధానం:-

1

ముందుగా బీట్రూట్ ని కడిగి చిన్న ముక్కలుగా తరిగి మిక్సి జార్ లో వేసి,అందులోనే పచ్చి మిర్చి,సోంపు,అల్లం వేసి ప్యూరిలా గ్రైండ్ చేసుకోవాలి.

2

ఇంకో పాత్ర లో గోధుమపిండి తీసుకొని దానిలో తగినంత ఉప్పు వేసుకోవాలి.ఇపుడుమిక్సి పట్టుకున్న మిశ్రమాన్నివేసి పూరిపిండిల కలుపుకోవాలి.అవసరం అయితే కొంచెం నీరు కలుపుకోవచ్చు.

3

పది నిముషాల తరువాత చిన్నఉండలుగా చేసుకుని, ఒక్కోఉండను పూరిలా చేసుకోవాలి. ఇపుడు నూనె ను వేడి చేసుకుని అందులో పూరిలను వేసి కాల్చుకోవాలి.

ఆలూసబ్జీ తో తింటే చాలా రుచిగా ఉంటుంది.పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.

Show More

Leave a Reply

Back to top button
error: Content is protected !!