పిల్లల వంటకాలురైస్వెజ్
బీట్రూట్ రైస్
బీట్రూట్ రైస్ చాలా రుచికరంగా,ఎర్రనిరంగులో చూడగానే తినాలనిపించేలా ఉండే ఆరోగ్యకరమైన వంటకం.బీట్రూట్ తినని పిల్లలకి ఇలా చేసి లంచ్ బాక్స్ లో పెట్టొచ్చు.తక్కువ సమయంలో తేలికగా చేయగలిగే రుచికరమైన వంటకం.
.
కావలసిన పదార్థాలు:-
- బీట్రూట్ ముక్కలు : ఒక కప్పు
- అన్నం : ఒకటిన్నర కప్పు
- పల్లీలు : 2 టేబుల్ స్పూన్లు
- సెనగ పప్పు : టేబుల్ స్పూన్
- పచ్చిమిర్చి - రెండు
- జీలకర్ర : ఒక టీస్పూన్
- ఆవాలు : అర టీస్పూన్
- కరివేపాకు : రెబ్బ
- ఉప్పు : తగినంత.
తయారుచేయు విధానం:-
1
ఒక పాన్‌లో కొంచెం నూనె వేసి వేడిచేశాక జీలకర్ర,ఆవాలు,పల్లీలు,సెనగ పప్పు వేసి వేయించాలి.
తరువాత పచ్చిమిర్చిని,కరివేపాకు వేసి వేయించాలి.
2
ఆ తరువాత తరిగిన బీట్ రూట్ ముక్కల్ని వేసి కలిపి మూత పెట్టి చిన్న మంట పై మూడు నిముషాల పాటు ఉడకనివ్వాలి.
3
పై మిశ్రమంలో అన్నం, ఉప్పు వేసి కలపాలి. కాసేపయ్యాక స్టవ్ ఆపేసి, వేడివేడిగా తింటే రుచిగా ఉంటుంది.
Tags
beetroot recipes beetroot recipes for kids beetroot recipes in telugu beetroot rice beetroot rice at home beetroot rice at home in telugu beetroot rice in telugu beetroot rice recipe Telugu Breakfast Recipes telugu healthy recipes telugu kids recipes Telugu recipe Website telugu recipes telugu rice recipes telugu vantala website beetroot recipes