నైవేద్యంస్వీట్స్

భక్ష్యాలు (బొబ్బట్లు )

ఉగాది తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమైనది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ.
ఈరోజు తెలుగువారందరు ఎంతో ఉత్సాహంతో సంతోషంగా జరుపుకుంటారు.ఈ పండగ ప్రత్యేక వంటకం భక్ష్యాలు /బొబ్బట్లు.వేరు వేరు ప్రాంతాల్లో వివిధ పేర్లతో ,రకరకాలుగా చేస్తారు. కొంతమంది వేరుశెనగ పప్పు,బెల్లంతో ,కొంత మంది శెనగపప్పు,నువ్వులు చాలా రకాలుగా చేస్తారు. మా ఇంట్లో శెనగపప్పుతో చేస్తారు. మా అమ్మ ఉగాది రోజున మాత్రమే భక్ష్యాలను తయారుచేసేది. ఎందుకంటే ఇది విస్తృతమైన ప్రక్రియ మరియు ఆమె మా పొరుగువారికి మరియు స్నేహితుల కోసం తయారుచేసేది. ఈ స్వీట్ తయారీలో నేను సహాయం చేసేదాన్ని. నేను వీటిని ఎంతగానో ఇష్టపడతాను. మరియు తెలుగువారికి ప్రత్యేకమైనది ఈ భారతీయ వంటకం.సులభమైన పద్దతిలో మీకోసం.

కావలసిన పదార్థాలు:-

తయారుచేయు విధానం:-

1

ఒక వెడల్పాటి పాత్రలో మైదా పిండి తీసుకుని దానిలో ఉప్పు, నూనె వేసి బాగా కలిపాక కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ ముద్దలా కలపాలి. దీనిపై మరో టేబుల్స్పూను నూనె వేసి మూతపెట్టి గంటసేపు నానబెట్టాలి.

2

శెనగపప్పును ప్రెషర్ కుక్కర్లో ఉడికించాలి.శెనగపప్పు ఉడికిన తరువాత నీళ్లను వడపోసి,పప్పును చల్లార్చాలి. చల్లగా అయిన తరువాత పప్పు బెల్లం, సోంపు పొడి వేసి మిక్సీలో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి.

3

ఈ మిశ్రమాన్ని నిమ్మకాయ పరిమాణంలో ఉండలుగా చేసుకోవాలి.

4

ప్లాస్టిక్ పేపర్ మీద నూనె రాసి మైదాపిండిని కొంచెం తీసుకుని అరచేయి మందాన ఒత్తుకుని దానిమద్యలో శెనగపప్పు మిశ్రమాన్ని పెట్టి నాలుగు వైపుల నుంచి మైదాపిండిని పైకి తెచ్చి ఒత్తి శెనగపప్పు మిశ్రమం బయటికి రాకుండా బంతిలా చేసుకోవాలి.

5

చేతికి నూనె రాసుకుని,ఈ ఉండలని ప్లాస్టిక్ పేపర్ మీద శెనగపప్పు మిశ్రమం బయటికి రాకుండా గుండ్రంగా ఒత్తాలి.

6

పెనం వేడయ్యాక చేతితో ఒత్తిన బొబ్బట్లను నెయ్యి వేసి బంగారు వర్ణం వచ్చేవరకు రెండు వైపులా తిప్పి వడ్డించుకోవాలి.
Show More

Leave a Reply

Back to top button
error: Content is protected !!