Home / కిడ్స్/ ❤️ బీట్‌రూట్ చపాతి రెసిపీ…

❤️ బీట్‌రూట్ చపాతి రెసిపీ…

February 10, 2026 8:39 pm
|
By

“బీట్‌రూట్ చపాతి ” అందంగా కనిపించే ఈ చపాతీ ఆరోగ్యకరమైనది మరియు తయారు చేయడం సులభం. బీట్‌రూట్ ప్యూరీ పిండికి చక్కని ఎరుపు రంగును ఇస్తుంది.ఇవి పిల్లలకు లేదా ఈ ఆరోగ్యకరమైన కూరగాయను తినడానికి ఇష్టపడని పెద్దలకు సరైనవి. బీట్‌రూట్‌లో చాలా మందికి నచ్చని మట్టి రుచి ఉంటుంది. బీట్‌రూట్ చపాతీ తయారు చేయడం ద్వారా, ఆ రుచి గుర్తించలేరు. పిల్లలు దాని ఎరుపు రంగుతో ఆకర్షితులవుతారు మరియు వారు ఎటువంటి ఫిర్యాదు లేకుండా సంతోషంగా తింటారు.

📝 కావలసినవి :

  • 🥕 బీట్‌రూట్ ముక్కలు – అర కప్పు

  • 🌾 గోధుమ పిండి – ఒక కప్పు

  • 🌶️ పచ్చి మిర్చి – 2

  • 🧄 వెల్లుల్లి రెబ్బలు – 2

  • 🌿 అల్లం – చిన్న ముక్క

  • 🧂 ఉప్పు – తగినంత

  • 🛢️ ఆయిల్ – తగినంత

 

👩‍🍳తయారు చేసే విధానం :-

1 : బీట్రూట్ ముక్కలు,పచ్చిమిర్చి,వెల్లుల్లి,అల్లం,చిటికెడు ఉప్పు, కొంచెం నీరు కలిపి ప్యూరిలా గ్రైండ్ చేసుకోవాలి.

2: వెడల్పాటి గిన్నెలో గోధుమ పిండిని తీసుకుని తగినంత ఉప్పు కలపాలి. తర్వాత గ్రైండ్ చేసిన బీట్‌రూట్ ప్యూరీ వేసి చపాతీ పిండిలా మృదువుగా కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీరు       కలపవచ్చు.

3: పిండిలో ఒక టీ స్పూన్ నూనె వేసి బాగా కలిపి పది నిమిషాలు మూతపెట్టి పక్కన ఉంచాలి.

4:- పిండిని నిమ్మకాయ పరిమాణంలో ఉండలుగా చేసి చపాతీలుగా వత్తాలి. వేడెక్కిన పెనం పై నూనెతో లేదా నెయ్యితో రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. బంగాళాదుంప కూరతో కానీ పెరుగు చట్నీ తో  బాగుంటుంది.