ఎగ్-లెస్కేక్బేకరీ

బటర్ స్కాచ్ ఐస్ క్రీం కేక్

కేక్,ఈ పేరు విననివారు కానీ చూడనివారు కానీ ఉండరేమో. ప్రత్యేకమైన రోజులను  ఇంకా ప్రత్యేకంగా మార్చుకోవాలంటే కేక్ ఉండాల్సిందే. అది పుట్టినరోజు దగ్గర నుండి ఏదైనా సాధించినరోజు వరకు.
పిల్లల దగ్గరనుండి పెద్దలవరకు అందరూ ఇష్టపడే కేక్ ని చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఓవెన్ ఉన్నవారైనా, లేనివారైన ఎవరైనా తమ అభిరుచికి తగ్గట్టుగా తయారుచేసుకోవచ్చు.
చాక్లెట్ తో కానీ, ఆరోగ్యదృష్టితో తో చూసినపుడు మనకు అందుబాటులో ఉన్న పండ్లతో ( అరటిపండు దగ్గర నుండి కర్బూజ వరకు ఏ పండుతో అయినా) చేసుకోవచ్చు.
చిన్నతనంలో కొన్ని ఇళ్ళలో దిబ్బరొట్టెనే కేక్ గా కట్ చేయించేవారు. ఆ తరువాత కేక్ అంటే షాప్ లోనే దొరుకుతుంది అనుకునేవాళ్లం. ఆ తరువాత ఓవెన్ ఉంటే తప్ప కేక్ చేయలేము అనుకునేవారు. మైదాతో మాత్రమే చేయవచ్చు అనే అపోహ ఉండేది.
కానీ ఇప్పుడు మనం ఏ పిండి తో అయినా అంటే గోధుమపిండి, రాగిపిండి, చివరకు బొంబాయి రవ్వతో కూడా ఇంట్లోనే సులభంగా, ఇబ్బంది లేకుండా పావుగంట సమయం కేటాయించగలిగితే రుచికరమైన కేక్ ని చేసి అందరి మెప్పు పొందవచ్చు.
ప్రత్యేకరోజుల్లో అయితే చిన్న చిన్న టిప్స్ తో తేలికగా అందంగా అలంకరించి, మీ  ఇంట్లోవారిని ఆశ్చర్యపరచవచ్చు.
ఈ రోజు ఇంకొంచెం వెరైటీగా ఐస్ క్రీమ్ తో కేక్ ఎలా చేసుకోవచ్చో చూద్దాం.

కావలసిన పదార్థాలు:-

తయారుచేయు విధానం:-

1

ముందుగా ప్రెజర్ కుక్కర్‌ అడుగున వెన్న లేదా నెయ్యితో రాసి మైదాపిండి చల్లి పక్కన పెట్టుకోవాలి.

2

ఇప్పుడు ఒక  గిన్నెలో నెయ్యి/వెన్న తీసుకొని బీట్ చేసుకోవాలి (గిలకొట్టాలి).తరువాత పంచదార,పెరుగు వేసి రంగు మారే వరకు బాగా బీట్ చేసుకోవాలి.

3

తరువాత మైదా,బేకింగ్‌పౌడర్‌,బేకింగ్‌ సోడా వేసి బాగా కలపిన బట్టర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ని వేసి బాగా కలుపుకోవాలి.

4

ఈ మిశ్రమాన్ని పిండి చల్లి ఉంచిన కుక్కర్‌లో పోసి సమంగా ఉండేట్టు చూసుకొని  మూతపెట్టాలి, విసిల్ పెట్టకూడదు.

5

తరువాత స్టవ్ పై నాన్ స్టిక్ పాన్ పెట్టి, దానిపై ప్రెజర్ కుక్కర్‌ పెట్టి,ముందు రెండు  నిమిషాలు ఎక్కువ మంట మీద ఉంచి తరవాత సిమ్‌లో పెట్టి అరగంటసేపు ఉంచాలి.

6

అరగంట తరువాత టూత్ పిక్ కానీ చాక్ కానీ కేకు లో గుచ్చి చూడాలి.అది అంటుకోకుండా  ఉంటే  స్టవ్ హాఫ్ చేసి, చల్లారిన తరువాత ప్లేట్లోకి తీసుకోవాలి.|
రుచికరమైన ఐస్ క్రీమ్ కేక్ ని  పిల్లలు చాలా ఇష్టపడతారు. పిల్లలతో కట్ చేయించి, వారితో  కలిసి ఆస్వాదించండి. చాలా ఆనందిస్తారు. 

మీకోసం మరికొన్ని కేక్ వంటకాలు 

ఆరెంజ్ కేక్

ఆపిల్ కేక్

 

Show More

Leave a Reply

Back to top button
error: Content is protected !!