చికెన్ 65

చికెన్ 65 అనగానే మాంసాహార ప్రియులకి నోరురిపోతుంటుంది. ధాబాల్లో మరియు రెస్టారెంట్లలో తయారుచేసే ప్రసిద్ధ వంటకాల్లో ఇది ఒకటి.చికెన్ 65 అనేది ఎరుపు రంగులో ఆకర్షణీయంగా ఉండే వేయించిన మసాలావంటకం.

కావలసిన పదార్థాలు:-

తయారుచేయు విధానం:-

1

ఒక గిన్నెలో చికెన్ ముక్కలు తీసుకోండి. అందులో ఉప్పు,అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్,1/4 టీ స్పూన్ మిరియాల పొడి,మైదా,కార్న్‌ఫ్లోర్ వేసి కలపాలి.తరువాత గుడ్డు వేసి బాగా కలపి పక్కన పెట్టుకోవాలి.

2

ఇప్పుడు ఒక కడాయిలో నూనెపోసి వేడి చేసి, చికెన్ ముక్కలనుఒక్కొక్కటిగా విడి విడి గా వేసి వేయించుకోవాలి.రెండు వైపులా ముదురు గోధుమ రంగు వచ్చేవరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.

3

తరువాత ఒక బాణలిలో 2-3 టీస్పూన్ నూనె వేడి చేసి, జీలకర్ర, చిన్న ముక్కలుగా తరిగి అల్లం, వెల్లుల్లి వేసి పచ్చి వాసన పోయేవరకు వచ్చేవరకు వేయించాలి.

4

తరువాత తరిగిన మిరపకాయలు, కరివేపాకు, అర టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్,1/4 టీ స్పూన్ మిరియాల పొడి, కారం, ఉప్పు,ఎరుపు రంగు, జీలకర్ర పొడి వేసి కలపి,కొన్ని నిమిషాలు ఉడికించాలి.

5

కొద్దిగా నీరు వేసి, ఆపై చికెన్ వేసి బాగా కలపి కొత్తిమీర వేసి వడ్డించుకోవాలి.
Show More

Leave a Reply

Back to top button
error: Content is protected !!