కర్రీస్నాన్ – వెజ్

చికెన్ కర్రీ

చికెన్ కర్రీ అనేది చాలా మంది ఇష్టపడే ప్రియమైన ఇంకా రుచికరమైన వంటకం.మాంసాహారంలో ఇది చాలా ప్రసిద్ది చెందింది,ఈ వంటకం- రైస్, చపాతి,పూరీ కలయికలో చాలా బాగుంటుంది.ఈ కలయికలో “పరోటా మరియు చికెన్ కర్రీ” – అత్యుత్తమ వంటకం. చికెన్ కర్రీని మనం చాలా విధాలుగా చేయవచ్చు, కొబ్బరి లేకుండా చికెన్ కర్రీని తయారుచేసే పద్ధతి ఇది. వేయించిన టమాట,ఉల్లిపాయల గ్రైండ్ చేసిన మసాలా ఈ వంటకానికి ప్రత్యేకమైన రుచిని మరియు చిక్కదనాన్ని ఇస్తుంది.

కావలసిన పదార్థాలు:-

తయారుచేయు విధానం:-

1

ముందుగా చికెన్ తీసుకొని శుభ్రం చేసి, దానిలో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, గరం మాసాల, ధనియా పొడి, పుదీన, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలిపి ఒక గంటసేపు మారినేట్ చేసి పెట్టుకోవాలి.

2

ఒక కడాయిలో ఒక స్పూన్ నూనె వేసి వేడి అయినా తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి, కొంచెం వేగాక టమాట ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. మగ్గిన తరువాత చల్లార్చాలి.

3

చల్లబడిన మిశ్రమాన్ని మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 

4

ఇపుడు అదే కడాయిలో మిగిలిన నూనె వేసి వేడయ్యాక జీలకర్ర,తరిగిన పచ్చిమిర్చి వేయాలి .అవి వేగాక పసుపు వేసి,గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి బాగా కలిపి మూతపెట్టి చిన్న మంట పై ఐదు నిముషాల పాటు ఉడకనివ్వాలి.

5

తరువాత మారినేట్ చేసిన చికెన్ వేసి బాగా కలిపి పదినిముషాలు ఉడికించాలి.

6

ఇపుడు కప్పు నీళ్ళు పోసి మూతపెట్టి సుమారు ఇరవై నిమిషాలపాటు ముక్క మెత్తగా ఉడికేవరకూ ఉంచాలి. చివరగా గరం మసాలా వేసి కలిపి దించి కొత్తిమీరతో అలంకరించాలి.

Show More

Leave a Reply

Back to top button
error: Content is protected !!