నాన్ – వెజ్బిర్యానిమాంసాహారం

చికెన్ దమ్ బిర్యానీ

చికెన్ బిర్యానీ అనే పేరు వినగానే అందరికి నోరూరుతుంది.దీనికి సైడ్ డిష్ అవసరం లేదు, అయినప్పటికీ, చాలామంది రైతాతో బిర్యానీని ఆనందిస్తారు. బిర్యానీ మొఘలాయ్ వంటకం,ఈ ఒక్క వంటకంలోనే అనేక వైవిధ్యాలు ఉన్నాయి. చికెన్ బిర్యానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత ప్రసిద్ధి చెందిన వంటకాల్లో ఒకటి. ఇది వివిధ మసాలా దినుసులతో తయారు చేయబడింది. ఇది ఉడికించిన  బియ్యం మరియు మాంసం యొక్క కలయిక, మరియు మనసుపెట్టి చేస్తే, అందరు దీన్ని ఖచ్చితంగా ఇష్టపడతారు. మీ ప్రియమైనవారికి ఏ సందర్భంలోనైనా ఈ వంటకాన్ని చేసి పెట్టి వారి మెప్పు పొందవచ్చు.ఇది నా సొంత పద్దతి.అందరు ఇష్టపడే ఈ వంటకం తయారు చేసే విధానం మీకోసం. ఇక ఆలస్యం ఎందుకు ప్రయత్నించండి మరియు మీకు ఇష్టమైన రైతా తో ఆరగించండి.

కావలసిన పదార్థాలు:-

తయారుచేయు విధానం:-

1

ఒక గిన్నెలో చికెన్, అల్లంవెల్లుల్లి పేస్టు,పెరుగు, నిమ్మరసం,గరం మసాలా పొడి,ధనియాల పొడి,పుదీనా,కొత్తిమీర,వేసి మసాలా చికెన్‌కు బాగా పట్టేలా కలపాలి. ఆ మిశ్రమాన్ని రెండు గంటలపాటు అలాగే ఉంచాలి.

2

బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంటపాటు నానబెట్టాలి.

3

కడాయిలో నూనె కొంచెం,నెయ్యి కొంచెం వేసి వేడి అయిన తరువాత పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను బంగారు రంగు వచ్చేవరకు వేయించి,తీసి పక్కన పెట్టుకోవాలి.

4

స్టవ్ పైన గిన్నె పెట్టి అందులో కొంచెం నూనె కొంచెం నెయ్యి వేయాలి. వేడి అయిన తరువాతలవంగాలు,షాజీరా,దాల్చినచెక్క,యాలకులు,అనాసపువ్వు,మరాఠిమొగ్గ,రాతిపువ్వు,బిర్యానీఆకు వేసి కలిపి,పచ్చిమిర్చిముక్కలు,వేసి ఉడకనివ్వాలి.తరువాత పుదీనా,కరివేపాకు,కొత్తిమీర వేసి కలిపి నీళ్లుపోయాలి.నీళ్ళు మరుగుతుండగా ఉప్పు వేసి కలిపి,నానబెట్టిన బియ్యం వేసి ఉడికించుకోవాలి.80% ఉడికిన తరువాత నీళ్లు వడపోసి అన్నంను పక్కన పెట్టుకోవాలి.ఇష్టమైన వారు ఫుడ్ కలర్ వేసుకోవచ్చు.

5

ఉల్లిపాయలను ఫ్రై చేసుకున్న కడాయిలోనే పచ్చిమిర్చి,చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి.తరువాత అల్లంవెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయేదాకా ఉడికించి,పుదీనా కొంచెం,కొత్తిమీర,గరంమసాలా కొద్దిగా,పసుపు వేసి కలిపి,ఊరబెట్టుకున్న చికెన్ వేసి బాగా కలిపి మూతపెట్టి 5 నిముషాలపాటు ఉడకనివ్వాలి.తరువాత కారం,ఉప్పు వేసి కలిపి ఉడికించాలి.

6

చికెన్ ఉడికిన తరువాత,ప్రెజర్ కుక్కర్ గిన్నె అడుగున ఒక స్పూన్ నెయ్యి వేసి రాసి దానిపైన బిర్యానీ ఆకులను పేర్చాలి.

7

దానిపై కొంచెం చికెన్ ఒక పొరలా వేసి,వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు, తరువాత ఉడికిన అన్నాన్ని చికెన్‌పై ఒక పొరలా వేసి దానిపై వేయించిన ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర తరుగు వేసి కలపాలి.అలా చికెన్ ఒకపొరలా, అన్నం ఇంకొక పొరలా వేస్తూ వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా మిశ్రమాన్ని వేయాలి. 1 టేబుల్ స్పూన్ నిమ్మరసంను వేయాలి. పైన కొంచెం నెయ్యిని వేయాలి.

8

ఇపుడు స్టవ్ పై  ప్రెజర్ కుక్కర్ పెట్టి, గస్కట్ తీసేసి మూతపెట్టి విజిల్ పెట్టాలి.

9

రెండు నిముషాలు పెద్ద మంట పై పెట్టి,ఆ తరువాత చిన్న మంట పై 15 నిముషాలు దమ్ చేయాలి.స్టవ్ ఆపేసి 5 నిముషాల తరువాత మూత తీసి కలిపి,నోరూరించే చికెన్ దమ్ బిర్యానీని వడ్డించుకోవాలి.

Show More

Leave a Reply

Back to top button
error: Content is protected !!