చికెన్ పచ్చడి | చికెన్ ఊరగాయ పేరు వినగానే చికెన్ ప్రేమికులకు నోరూరుతుంది. చికెన్ ముక్కలను మసాలా దినుసులతో కలిపి తయారుచేస్తారు. ఇది దక్షిణ భారతీయ వంటకం. చికెన్ పచ్చడిని అన్నంతో కానీ,పులావ్, రోటిస్, నాన్స్ లేదా అప్పంతో వడ్డించుకుంటే రుచికరంగా ఉంటుంది.
కావలసిన పదార్థాలు:-
- చికెన్ : 250 గ్రా.
- అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1/2 టేబుల్ స్పూన్
- కారం : 1/2 స్పూన్
- ధనియాలు : 3/4 టేబుల్ స్పూన్
- ఆవాలు : 1/2 స్పూన్
- గసగసాలు : 1 స్పూన్
- దాల్చినచెక్క : 1/2 అంగుళాల
- లవంగాలు : 5
- ఏలకులు : 1
- జీలకర్ర : 1/2 స్పూన్
- నిమ్మరసం : 1 టేబుల్ స్పూన్
- నూనె : తగినంత
- ఉప్పు : తగినంత
తయారుచేయు విధానం:-
1
చికెన్ ని శుభ్రపరచి, దానికి పసుపు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పది నిముషాలపాటు పక్కన పెట్టండి.
2
ధనియాలు, ఆవాలు, గసగసాలు, దాల్చినచెక్క, లవంగాలు, ఏలకులు మరియు జీలకర్ర విడి విడిగా వేయించుకోవాలి.
వేయించిన మసాలా దినుసులను చల్లగా అయిన తరువాత, వాటిని మెత్తగా పొడి చేయాలి.
3
4
స్టవ్ ఆపేసి, మూకుడులో ఒక కప్పు నూనె మాత్రం ఉంచి మిగిలిన నూనె తీసివేయాలి.
నూనె వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా కరివేపాకు, మసాలా పొడి, కారం, ఉప్పు వేసి కలిపి,చికెన్ ముక్కలను కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి.
5
చల్లారిన తరువాత నిమ్మకాయ రసం కలపితే నోరూరించే చికెన్ పచ్చడి రెడీ.
చికెన్ పచ్చడిని పచ్చడి కూజాలో/గాజు సీసాలో తీసుకుని పెట్టుకుంటే నెల రోజులు నిల్వ ఉంటుంది.