నాన్ – వెజ్మాంసాహారంస్టార్టర్స్

చిల్లి చికెన్

చిల్లి చికెన్ నోరూరించే ఇండో-చైనీస్ చికెన్ వంటకం.ఈ డిష్‌లో ప్రధానంగా వేయించిన బోన్‌ లెస్ చికెన్‌ను,భారతీయ కూరగాయలు మరియు చైనీస్ రుచుల కలయికతో వండుతారు మరియు దీనిని స్టార్టర్‌గా కూడా అందించవచ్చు.

కావలసిన పదార్థాలు:-

తయారుచేయు విధానం:-

1

ఒక గిన్నెలో సగం జొన్నపిండి,ఉప్పు,మిరియాల పొడి,కోడి గుడ్డు సోనవేసి బాగా కలపాలి. తరువాత అందులోనే కొద్దిగా సోయాసాస్ వేసి కలపాలి. ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసిన చికెన్ ముక్కలు వేసి బాగా కలపాలి.

2

కడాయి లో నూనె పోసి చికెన్ ముక్కల్ని వేయించి తీయాలి.

3

ఇపుడు ఒక పాన్ లో టేబుల్ స్పూన్ నూనె వేసి,సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసి వేయించాలి. తరువాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి,ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. మిగిలిన సోయాసాస్,రెడ్ చిల్లి సాస్ వేసి బాగా కలపాలి.తరువాత చికెన్ ముక్కలు వేసి వేయించాలి.

4

ఇప్పుడు మిగిలిన జొన్నపిండిలో కొద్దిగా నీళ్ళు పోసి కలిపి ముక్కల మీద పోసి కలపాలి. చివరగా ఉప్పు సరిచూసుకుని రెండు నిముషాలు ఉడికించి వెనిగర్ వేసి కలిపితే ఘుమ ఘుమలాడే చిల్లి చికెన్ రెడీ.
Show More

Leave a Reply

Back to top button
error: Content is protected !!