ఎగ్-లెస్కేక్బేకరీ

చాక్లెట్ కేక్

ఇంట్లో పిల్లలు చిరుతిళ్లు కోసం చేసే  హంగామా మామూలుగా ఉండదు. అందులోనూ ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో బయట పదార్దాలను కొనాలంటే భయం, అదే ఇంట్లో చేసుకుంటే శుభ్రత, ఆరోగ్యం.కేక్ ని పిల్లలు ఇష్టంగా తింటారు. కాబట్టి ఇంట్లో వుండే పదార్థాలతో కేక్ చేసుకుంటే పిల్లలు లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. పిల్లలూ పెద్దలూ బాగా ఇష్టపడే పదార్థాల్లో చాక్లెట్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. అందులోనూ చాకొలెట్ కేక్ అంటే నోరూరకుండా ఉంటుందా ఎవరికైనా, మరి అందరు ఇష్టపడే ఎగలెస్ చాకొలెట్ కేక్ ఎలా చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు:-

తయారుచేయు విధానం:-

1

ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని, అందులో చిన్న స్టాండ్ పెట్టి మూత పెట్టి, మీడియం మంటపై పెట్టుకోవాలి.

2

ఇప్పుడు ఒక గిన్నెలో మైదాపిండి, కోకో పౌడర్‌, వంటసోడా, బేకింగ్‌ పౌడర్‌, ఉప్పు వేసి బాగా కలపాలి.

3

తరువాత ఇంకొక గిన్నెలో నెయ్యి,పెరుగు, పంచదార వేసి, అన్ని పదార్థాలు కలిసేలా గిలకొట్టాలి.రంగు మరే వరకు బీట్ చేసుకోవాలి.

4

తరువాత మైదా మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేస్తూ బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కేక్ టిన్ లో కానీ, గిన్నెలో కానీ పోసి, రెండు మూడు సార్లు తట్టాలి. అప్పుడు పిండి మిశ్రమం సమంగా అవుతుంది.

5

ఈ గిన్నెను వేడి చేసుకున్న గిన్నెలో స్టాండ్ పై పెట్టి, మూతపెట్టి, 25-30 నిముషాల వరకు ఉంచాలి. తరువాత టూత్ పిక్ కానీ, చాక్ తో కానీ కేక్ మద్యలో కుచ్చాలి. అది బయటికి తీసినపుడు కేక్ అంటుకోకుండా ఉంటే, స్టవ్ ఆఫ్ చేసి, అరగంట పాటు చల్లార్చాలి.

6

తరువాత నచ్చినట్టుగా, మనకు అందుబాటులో ఉన్న జెమ్స్ లేదా బిస్కెట్స్ తోకానీ, పండ్లతో కానీ అలంకరిచుకోవచ్చు.

మీకోసం మరికొన్ని కేక్ వంటకాలు 

ఆపిల్ కేక్ 

ఆరెంజ్ కేక్ 

 

Show More

Leave a Reply

Back to top button
error: Content is protected !!