అల్పాహారంటిఫిన్స్వెజ్శాఖాహారం

చోళే బతుర

చోళే బతుర| నోరూరించే పంజాబీ వంటకం.మసాలా శనగల కర్రీ మరియు ఫ్రైడ్‌ ఫ్లాట్‌బ్రెడ్స్‌’ కలయికను ‘చోళే బతుర’ అంటారు.ఎంతో రుచికరంగా ఉండే ఈ వంటకంను ఉత్తరభారతదేశంలో ఎక్కువగా అల్పాహారం/చిరుతిండిగా తీసుకుంటారు.దీనిని అల్పాహారంతో పాటు భోజనం లేదా విందుగా కూడా అందించవచ్చు.

కావలసిన పదార్థాలు:-

సూచనలు :-

సెనగలను ముందురోజు రాత్రి నానబెట్టుకోవాలి.మరుసటి రోజు ఈ వంటకాన్ని చేసుకోవాలి.
బతుర కోసం పిండిని కనీసం రెండుగంటల ముందు కలిపి పెట్టుకోవాలి.

తయారుచేయు విధానం:-

1

సెనగలను ముందురోజు రాత్రి నానబెట్టుకోవాలి.నానబెట్టిన సెనగలను కుక్కర్ లో వేసి నాలుగు విజిల్స్ వచ్చేవరకూ ఉడికించాలి.

2

ఉల్లిపాయలు ,టొమాటోలు విడి విడిగా మిక్సీలో వేసి మెత్తగా పేస్టులా చేసి పక్కన పెట్టుకోవాలి.

3

ఇపుడు కడాయిలో నూనెపోసి వేడి అయిన తరువాత ఉల్లిపేస్ట్ ని వేసి వేయించుకోవాలి. కొంచెం వేగిన తరువాత టొమాటో ప్యూరిని,అల్లంవెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసి మూడు నిముషాలు వేయించాలి. తరువాత మిగిలిన మసాలా పొడులన్ని వేసి మరో మూడు నిముషాల పాటు ఉడికించాలి.

4

చివరగా ఉడికించిన సెనగలు వేసి తగినన్ని సెనగలు ఉడికించిన నీటిని,ఉప్పు వేసి బాగా కలిపిన తరువాత టమాటో కెచప్ వేసి కలిపి మూత పెట్టి ఓ ఐదు నిముషాలు ఉడికించి దించాలి.

5

ఒక వెడల్పాటి గిన్నెలో మైదా పిండి తీసుకుని,అందులో ఉప్పు,చక్కెర,రవ్వ,బేకింగ్ సోడా,పెరుగు,నూనె వేసి బాగా కలిపి,గోరువెచ్చని నీరు పోసి మెత్తగా చపాతీ పిండిలా కలుపుకుని,దానిపైన కొంచెం నూనె వేసి కలిపి మూత పెట్టి రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి.

6

తరువాత చిన్నచిన్న ఉండలుగా చేసుకుని కొంచెం మందమైనపూరీలుగా చేసుకుని,నూనెలో రెండువైపులా వేయించుకుని, వేడి వేడి చోళే మసాలాతో వడ్డించుకోవాలి.
Show More

Leave a Reply

Back to top button
error: Content is protected !!