Home / కర్రీస్/ 🔥 మేక కాళ్ల పాయ – ఇంట్లోనే హోటల్ స్టైల్ రుచి

🔥 మేక కాళ్ల పాయ – ఇంట్లోనే హోటల్ స్టైల్ రుచి

February 10, 2026 1:22 pm
|
By

చలికాలంలో అయినా, స్పెషల్ ఫ్యామిలీ డిన్నర్‌లో అయినా
మేక కాళ్ల పాయ ఉంటే డైనింగ్ టేబుల్‌కి వచ్చే కళే వేరు 🔥
పోషకాలతో నిండిన ఈ సంప్రదాయ వంటకం రుచి మాటల్లో చెప్పలేం… తినాల్సిందే!

📝 కావలసినవి :

  • 🐐 మేక కాళ్లు : నాలుగు

  • 🌶️ కారం : 3 చెంచాలు

  • 🧅 ఉల్లిపాయలు : రెండు

  • 🌿 పుదీనా ఆకులు : కట్ట (చిన్నది)

  • 🛢️ నూనె : 5 చెంచాలు

  • 🌿 కొత్తిమీర : కట్ట (చిన్నది)

  • 🌰 నల్లయాలకులు : రెండు

  • 🌸 లవంగాలు : రెండు

  • 🌿 దాల్చినచెక్క : అంగుళం ముక్క

  • 🧂 ఉప్పు : రుచికి సరిపడా

  • 🧄 అల్లం వెల్లుల్లి ముద్ద : 1 1/2 చెంచాలు

  • 🥥 పచ్చి కొబ్బరితురుము : 3 చెంచాలు

  • 🌰 గసగసాలు : 3 చెంచాలు

  • 💛 పసుపు : చెంచా

  • 🍋 నిమ్మకాయ : ఒకటి

👉 పొట్లి మసాలా: 5 – చెంచాలు (బిర్యాని ఆకు, దనియాలు, జీలకర్ర, తోక మిరియాలు, నల్లయాలకులు, దాల్చినచెక్క, పత్తర్‌ కా పూల్‌ ( రాతి పువ్వు), అనాసపువ్వు, కసూరిమేతి, సొంపు, షాజీరా, స్టార్ అనిస్, జాపత్రి మరియు జాజికాయ, గసగసాలు, అన్నింటిని చిన్న మస్లిన్ క్లాత్ (పొట్లం) లో కట్టాలి. దీనినే పొట్లి మసాలా అంటారు. హైదరాబాదీ వంటల్లో దీన్ని ఎక్కువగా వాడ‌తారు. ఇది మార్కెట్లో నేరుగా దొరుకుతుంది)

🍽️ తయారీ విధానం

1: మేక కాళ్లకు పసుపు పట్టించి బాగా కడగాలి. గసగసాలు, కొబ్బరి ముద్దలా చేయాలి.

2: ప్రెషర్‌కుక్కర్‌లో మేక కాళ్లు వేసి సగం కారం, సగం అల్లంవెల్లుల్లిముద్ద, ఉప్పు, పుదీనాతురుము, కొత్తిమీర‌ తురుము, తగినన్ని నీళ్లు పోసి అర‌గంటసేపు సిమ్‌లో పెట్టి ఉడికించాలి.

3: బాణలిలో నూనె వేసి దాల్చినచెక్క, యాలకులు, లవంగాలు, మిగిలిన అల్లంవెల్లుల్లిముద్ద వేసి వేయించాలి.

4: త‌రువాత‌ ఉల్లిముక్కలు, పసుపు, మిగిలిన కారం, దనియాలపొడి వేసి కలిపి వేయించాలి. ఇప్పుడు కొబ్బరి – గసగసాల ముద్ద వేసి ఓ నిమిషం వేయించాలి.

5: త‌రువాత‌ కుక్కర్‌లో ఉడికించిన మేక కాళ్లని నీళ్లతో సహా వేసి ఈ మిశ్రమంలో సుమారు పావుగంటసేపు ఉడికించాలి.

7: ఇప్పుడు పొట్లి మసాలాని ఓ పలుచని బట్టలో మూటలా కట్టి ఆ మూటని అందులో వేసి సుమారు ఐదు నిమిషాలు ఉడికించాలి.

8: ఉప్పు సరిచూసి,  నిమ్మకాయ రసాన్ని చివర్లో పాయా ఉడికిన తర్వాత కలపాలి. దీనివల్ల పాయ రుచి ఇంకా ఫ్రెష్‌గా, బ్యాలెన్స్‌గా ఉంటుంది. 😋దించి వేడివేడిగా వడ్డించాలి.

సంప్రదాయ రుచితో, ఆరోగ్యానికి మేలు చేసే స్పెషల్ వంటకం ఇది.
మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి 🤍

👉 ఇంకా ఇలాంటి ఆథెంటిక్ తెలుగు వంటకాల కోసం ఫాలో అవ్వండి 🔔
👉 ఈ రెసిపీ నచ్చితే షేర్ చేయడం మర్చిపోవద్దు 💬💖