స్వీట్స్

డబుల్‌ కా మీఠా

డబుల్‌కామీఠా | హైదరాబాదీ వంటకాలలో మొఘలాయ్ వంటకాలు బాగా ప్రసిద్ధి చెందాయి. దాని నుండి వచ్చినరుచికరమైన తియ్యని వంటకం డబుల్ కామీటా, చక్కెర పాకంలో వేయించిన బ్రెడ్ ముక్కలు మరియు తరువాత ఏలకులు వేసి,పాలను కలిపి చేస్తారు.

కావలసిన పదార్థాలు:-

తయారుచేయు విధానం:-

1

పాలను మందపాటి గిన్నెలో మరిగించి పెట్టుకోవాలి.

2

మరో గిన్నెలో పంచదార, నీళ్లు వేసి పాకం పట్టాలి.పాకం మరుగుతున్నపుడే యాలకులపొడి వేయాలి.

3

బ్రెడ్‌ముక్కలను నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి.వేయించిన బ్రెడ్‌ ముక్కలను చక్కర పాకంలోవేసి కలపాలి.

4

కలిపిన బ్రెడ్ పైన ఒక స్పూన్ నెయ్యి వేసి కలపకుండా దానిపైన చిక్కటి పాలను పోసి ఒక నిముషం తరువాత కలపి పొయ్యి మీద చిన్న మంట మీద ఉంచాలి.

5

10 నిమిషాల్లో నెయ్యిపైకి తేలుతూ డబుల్‌కామీఠా నోరూరించేలా తయారవుతుంది.దానిపైన జీడిపప్పు కిస్ మిస్ లు వేసి వేడిగా వడ్డించండి .
Show More

Leave a Reply

Back to top button
error: Content is protected !!