నాన్ – వెజ్బిర్యానిమాంసాహారం

ఎగ్ బిర్యాని

ఎగ్ బిర్యానీ | గుడ్డు బిర్యానీ లేదా కోడిగుడ్డు బిర్యానీ ఒక రుచికరమైన భారతీయ వంటకం. ఇంట్లో తయారు చేయడం చాలా సులభం. కోడి గుడ్డు పోషకాహారం అధికంగా వుండే పదార్ధాలలో ఒకటి. అయితే, గుడ్డుతో ఆహారం చేయటం అతి తేలిక.అయితే కొంచెం డిఫరెంట్ టేస్ట్ కోసం సులభంగా ఎగ్ బిర్యాని తక్కువ సమయంలో చేసుకోవచ్చు. ఎగ్ బిర్యానీ, రైతా మరియు కూరలతో సంపూర్ణ భోజనంగా మారుస్తుంది.ఈ రుచికరమైన కోడిగుడ్డు బిర్యానీని మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు చేసి పెట్టి వారి అభినందనలు అందుకోండి.

కావలసిన పదార్థాలు:-

తయారుచేయు విధానం:-

1

కోడిగుడ్లను ఉడికించి పెంకు తీసి,నూనెలో వేయించి గాట్లు పెట్టుకుని పక్కన ఉంచాలి.

2

ఒక బాణలిలో నూనె లేదా నెయ్యి వేసి వేడి చేసి దాల్చిన చెక్క, యాలకులు,లవంగాలు,బిర్యానీ ఆకు వేసి, వేయించాలి.

3

తర్వాత ఉల్లిపాయముక్కలు,పచ్చిమిర్చి ముక్కలు,పుదీనా,కొత్తిమీర,కరివేపాకు,అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేయాలి

4

రెండు నిమిషాల తర్వాత కారం, పసుపు వేసి కలిపి కోడిగుడ్లు వేయాలి. అవి రంగు మారిన తరువాత కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి బాగా కలపాలి.

5

రెండు నిమిషాల తరువాత నీళ్లు పోసి,ఉప్పు, గరం మసాలా పొడి వేసి కలిపి మూత పెట్టాలి.

6

మీడియం మంట మీద ఉడికించి నీరంతా ఇగిరిపోయి,అన్నం పొడిపొడిగా అయ్యాక కొత్తిమీర తురుము,వేయించిన ఉల్లిపాయలు చల్లుకుని వడ్డించుకోవాలి.

Show More

Leave a Reply

Back to top button
error: Content is protected !!