శక్తినిచ్చే బార్| పిల్లల కోసం ఇంట్లో తయారుచేసిన శక్తినిచ్చే బార్‌లు, పోషక పదార్థాలు మరియు సహజమైన తియ్యని పదార్దాలైన ఖర్జురాలు ,బెల్లంతో తయారుచేయబడతాయి. కాబట్టి అవి పిల్లలకు ఆరోగ్యకరమైన గొప్ప చిరుతిండి. అందరికి ఆరోగ్యకరమైనది. సాధారణంగా పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినడానికి అందులోను వాల్ నట్స్,పిస్తా లాంటివి తినడానికి ఇష్టపడరు.కానీ ఇలా బార్ లాగా చేసినప్పుడు చూడడానికి బాగుంటాయి.వాళ్ళు ఆసక్తిని కనపరుస్తారు. రుచికరంగా కూడా ఉంటాయి.
కావలసిన పదార్థాలు:-
ఖర్జుర : 1/2 కప్పు
బెల్లం పొడి :1/4 కప్పు
బటర్ : టేబుల్ స్పూన్
ఓట్స్ :కప్పు
వాల్ నట్స్ :15
బాదం :15
జీడి పప్పు :10
పిస్తా :15
ఎండు ద్రాక్ష :15
తేనె : స్పూన్ (ఆప్షనల్ )
తయారుచేయు విధానం:-
1
ముందుగా బాదం ,జీడిపప్పు ,పిస్తా ,వాల్ నట్స్ ,ఓట్స్ ని వేరు వేరుగా వేయించి పెట్టుకోవాలి.
2
అన్ని పదార్దాలను కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.(కావాలనుకుంటే కచ్చా పచ్చ గా కూడా చేసుకోవచ్చు.)
3
ఒక ప్లేట్ తీసుకుని దానికి నూనె లేదా నెయ్యి రాసి అందులో గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసి అంగుళం మందంతో వెడల్పుగా పేర్చుకోవాలి.
4
ఇపుడు బార్ లాగా మీకు కావాల్సిన పరిమాణంలో కట్ చేసుకోవాలి.
చిట్కా:-
ఇవి ఫ్రిడ్జ్ లో పెడితే పదిరోజుల వరకు తాజాగా ఉంటాయి.