స్వీట్లుస్వీట్స్

జిలేబి

జిలేబి క్రిస్పీగా,జ్యూసిగా ఉండే రుచికరమైన స్వీట్. జీలేబీలు చూడగానే నోరూరించే స్వీట్ అని చెప్పవచ్చు. తేలికగా మరియు త్వరగా అరగంటలో చేసుకోగలిగే తీపివంటకం. ఇది స్వీట్స్ లో ప్రముఖమైనది. భారతదేశంలో అన్నీ ప్రాంతాల్లోను కనిపిస్తుంది. ముఖ్యంగా పండుగ రోజుల్లో, పెళ్లి, ఫంక్షన్స్ లో వడ్డిస్తారు. అలాగే ఇది పాపులర్ స్ట్రీట్ ఫుడ్. స్వీట్స్ లో ఇది ప్రత్యేకమైనది. చూడడానికి అందంగా చుట్లు, చుట్లుగా, మెరుస్తూ నోరూరించే వంటకం. ఇలా నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతుంది. మరి ఇంత రుచికరమైన జిలేబి ఎలా చేయాలో చూద్దాం పదండి..

కావలసిన పదార్థాలు:-

తయారుచేయు విధానం:-

1

ఒక పాత్రలో పంచదార, నీరు, కలిపి స్టవ్ పై పెట్టి, మరిగించి,  తీగపాకం వచ్చాక,పక్కన పెట్టుకోవాలి.

2

: తరువాత ఇంకొక పాత్రలో మైదా, వంటసోడా, పెరుగు, ఫుడ్ కలర్, వేసి కలిపి,తగినంత నీరు పోసి జారుగా కలుపుకోవాలి.

3

కడాయిలో నూనె పోసి వేడైన తరువాత,కలుపుకున్న పిండిని సాస్ బాటిల్లో కానీ పాలిథిన్ కవర్ తో చేసిన కోన్ లో కానీ వేసి, వేడి నూనెలో జీలేబిల్లా వేసుకుని, వేయించి తీసి, చక్కెర పాకంలో వేయాలి.

4

పదినిముషాల తరువాత  ప్లేట్ లోకి తీసుకుని,కాసేపటికి వడ్డించుకుంటే చక్కరపాకం జీలేబీలకు పట్టి మరింత తియ్యదనాన్ని,రుచిని ఇస్తాయి. జీలేబీలు వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి

చిట్కాలు :-

చక్కరపాకం గోరువెచ్చగా ఉండేట్టు చూసుకోవాలి.చల్లారిన పాకంలో వేసినప్పుడు జీలేబీలు ఎక్కువగా పాకాన్ని పట్టుకోలేవు.

జీలేబీలు వేయాడానికి సాస్ బాటిల్ కానీ, మందమైన క్లాత్ కి చిన్న రంద్రం చేసి జీలేబీలు వేసుకోవచ్చు. లేదా పాలిథిన్ కవర్ / పాలపాకెట్ ని కోన్ లా చేసి అందులో పిండి వేసి జీలేబీలు వేసుకోవచ్చు.

 

మరి కొన్ని తెలుగు వంటలు మీకోసం .. 

కొబ్బరి లడ్డు

సున్నుండలు 

 

 

Show More

Leave a Reply

Back to top button
error: Content is protected !!