పిల్లల వంటకాలుస్వీట్స్

కొబ్బరి లడ్డు

కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిది. కొబ్బరికాయను శుభప్రదంగా భావిస్తారు.ప్రతి పండుగలోను కొబ్బరికి ప్రత్యేకస్థానం ఉంటుంది.పచ్చికొబ్బరిలో పోషకాలు అధికంగా ఉంటాయి. పచ్చికొబ్బరిని అంతే పోషకాలున్న బెల్లంతో కలిపి చేసే కొబ్బరి లడ్డులు చాలా ఆరోగ్యకరమైనవి. వీటిని కొబ్బరి లౌజు అని కూడా పిలుస్తారు. ఇది సాంప్రదాయక వంటకం, పాతకాలంలో పిల్లల ఎదుగుదల కోసం చేసి పెట్టేవారు. 

కావలసిన పదార్థాలు:-

తయారుచేయు విధానం:-

1

ఒక మందమైన వెడల్పాటి గిన్నెలో కొంచెం నెయ్యి వేసి, వేడైన తరువాత కొబ్బరి తురుమును వేసి చిన్న మంటపై దోరగా వేయించుకోవాలి.

2

కొబ్బరి దోరగా వేగిన తరువాత కప్పు తరిగిన బెల్లం వేసి బాగా కలుపుకోవాలి.( తీపిని ఇష్టపడేవాళ్లు బెల్లంను కొబ్బరికి సమానంగా వేసుకోవచ్చు. )

3

రెండు నిముషాల తరువాత బెల్లం కరగడం కోసం కొంచెం నీటిని పోసి, బెల్లం కరిగేంతవరకు కలుపుతూనే ఉండాలి.

4

బెల్లం కరిగిన తరువాత యాలకుల పొడిని వేసి, పది నిముషాలపాటు చిన్నమంట పైనే తీగపాకం వచ్చేవరకు వేయించుకోవాలి. తీగపాకం రాగానే స్టవ్ ఆపేయాలి. ముదురుపాకం వస్తే గట్టిగా  అవుతుంది.

5

మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకుని, కొంచెం చల్లారిన తరువాత కొంచెం కొంచెం చేతిలోకి తీసుకుని నిమ్మకాయ పరిమాణంలో ఉండలు చుట్టుకోవాలి. అంతే నోరూరించే, ఆరోగ్యకరమైన కొబ్బరిలడ్డులు రెడీ !
కొబ్బరి లడ్డులు వారం రోజుల వరకు నిలువ ఉంటాయి.

      మీకు నచ్చే మరికొన్ని తీపి వంటలు 

     రవ్వలడ్డు 

     సున్నుండలు 

Show More

Leave a Reply

Back to top button
error: Content is protected !!