అల్పాహారంటిఫిన్స్

మినప వడలు

మినుప వడలు ప్రసిద్ధ దక్షిణ భారత సాంప్రదాయ అల్పాహార వంటకం.మినపవడలను చిరుతిండిగా కూడా తింటారు.ఈ తేలికపాటి చిరుతిండిని సులభంగా తయారు చేసుకోవచ్చు.రుచికరంగా ఉండే ఈ వడలను అందరు ఇష్టపడతారు.

కావలసిన పదార్థాలు:-

తయారుచేయు విధానం:-

1

మినప్పప్పుని ఆరు గంటలు నానబెట్టాలి.

2

తరువాత నీరు వంచేసి మిక్సీ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీలైనంత వరకు నీరు పొయకుండా గ్రైండ్ చేయాలి. మరీ కుదరకపొతె కొంచెం నీరు కలిపి మెత్తగా పిండి పట్టండి. నీరు పోస్తే వడనూనె ఎక్కువగా పీల్చుకుంటుంది.

3

పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని ఉప్పు,సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి.

4

నూనె వేడయ్యాక ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని కొంచెం నూనె రాసి,చెయ్యి తడిచేసుకుని పిండి కొంచెం కొంచెం తీసుకుని కవర్ మీద గుండ్రంగా చేత్తో వొత్తుకోవాలి. మధ్యలో చిన్న రంధ్రం చెయ్యాలి.

5

వడని మెల్లగా చేతిలోకి తీసుకుని నూనెలో నిదానంగా వేసి,రెండు వైపులా బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీయాలి. ఇలా అన్ని వడలు చేసుకుని వేయించుకోవాలి.
అల్లంపచ్చడి తో కాని కొబ్బరిపచ్చడితో కాని వడ్డించండి.
Show More

Leave a Reply

Back to top button
error: Content is protected !!