కర్రీస్నాన్ – వెజ్మాంసాహారం
మటన్ పాయ
మటన్ పాయ అనేది మేక కాళ్లతో చేసె వంటకం. దక్షిణ భారతీయ మాంసాహార వంటకాలలో మటన్ పాయ ప్రసిద్ది చెందింది.ఇది హైదరాబాదీ శైలిలో వండిన మటన్ వంటకం.ఇది చాలా ఆరోగ్యకరమైన వంటకం.మటన్ పాయా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నందున ఇది చిన్నపిల్లలు మరియు పెద్దవారికి చాలా మంచిది.మరియు రుచికరమైన వంటకం.
కావలసిన పదార్థాలు:-
- మేక కాళ్ళు – 4
- పసుపు పొడి – 1/2 టీ స్పూన్.
- అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్.
- కరివేపాకు – 1 రెబ్బ
- ఉల్లిపాయలు (తరిగిన) – 1కప్పు
- బిర్యానీ ఆకులు – 2
- ఏలకులు – 2
- దాల్చిన చెక్క – 2
- సాజీరా – 1/2 టీ స్పూన్.
- లవంగాలు – 2
- సోంపు – 1/2 టీ స్పూన్
- నూనె – 2 టేబుల్ స్పూన్లు.
- ఉప్పు – తగినంత
- పచ్చి మిర్చి – 3
- తాజా కొబ్బరి పొడి – 1 టేబుల్ స్పూన్
- కొత్తిమీర పొడి – 1 టేబుల్ స్పూన్
- గరం మసాలా పొడి – 1/2 టీ స్పూన్
- మిరియాలు పొడి – 1/2 టీస్పూన్లు.
- కారం – 1 టీ స్పూన్
- కొత్తిమీర – 1 కట్ట
- నీరు – తగినన్ని.
తయారుచేయు విధానం:-
1
పసుపు మరియు నీటితో మేక కాళ్ళను బాగా శుభ్రం చేసి పక్కన ఉంచండి.
2
ప్రెషర్ కుక్కర్ తీసుకొని దానిలో నూనె వేసి ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, సోంపు, బిర్యానీ ఆకు, తరిగిన ఉల్లిపాయలు వేసి కలపండి తరువాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు,పచ్చిమిర్చి,ఉప్పు వేసి కలపండి.
3
ఇప్పుడు ఈ మిశ్రమంలో మేక కాళ్ళను వేసి బాగా కలపండి మరియు అవసరమైనన్ని నీళ్ళు పోసి, ప్రెజర్ కుక్కర్ మూత పెట్టి, చిన్న మంటపై కనీసం 30 నిమిషాలు ఉడికించాలి.
4
మేక కాళ్ళు ఉడికిన తర్వాత కొబ్బరి పొడి, కొత్తిమీర, గరం మసాలా పొడి,మిరియాల పొడి, కారం పొడి వేసి బాగా కలపాలి.మీకు ఎక్కువ సూప్ కావాలంటే మరో 10 నుండి 15 నిమిషాలు ఉడికించాలి.
చివరగా, తరిగిన కొత్తిమీర వేసి వడ్డించాలి.
Tags
goat legs paaya goat legs paaya in telugu home made mutton paaya in telugu How to make mutton paaya meka kaalla paya mutton mutton paaya mutton paya mutton paya in telugu mutton paya recipe mutton recipes non veg recipes in telugu paaya paaya in telugu Paya paya in telugu paya recipe in telugu recipes in telugu telugu non veg recipes Telugu recipe Website telugu recipes telugu vantalu