మైసూర్ బోండా | ప్రజాదరణ పొందిన దక్షిణ భారతీయ వంటకం. ఈ సులభమైన వంటకాన్ని 20 నిమిషాల్లోపు తయారు చేసుకోవచ్చు మరియు మీ అతిథులకు టీ, కాఫీ లేదా మీకు నచ్చిన ఏదైనా పచ్చడితో అందించవచ్చు.కాబట్టి ఇంత సులభమైన వంటకాన్ని మీరు ఇంట్లో తయారు చేయగలిగినప్పుడు ఎందుకు బయటకు వెళ్లి దుకాణాల నుండి కొనడం. ఈ రుచికరమైన బోండాలను మీ ఇంట్లో వారికి చేసిపెట్టి వారి మెప్పు పొందండి. ఆస్వాదించండి.
కావలసిన పదార్థాలు:-
- మైదాపిండి : ఒకటిన్నర కప్పు
- బియ్యప్పిండి : అర కప్పు
- పెరుగు : ఒకటిన్నర కప్పు
- కొత్తిమీర తురుము : రెండు టేబుల్ స్పూన్లు
- జీలకర్ర : 1 టీస్పూన్
- పచ్చిమిర్చి ముక్కలు : 1 టీస్పూను
- అల్లంతురుము : ఒక టీస్పూను
- వంటసోడా: 1/4 టీ స్పూను
- కరివేపాకు – రెబ్బ
- ఉప్పు : తగినంత
- నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేయు విధానం:-
1
మీడియం మంట మీద లోతైన బాణలిలో నూనె వేడి చేయండి.
2
ఈలోగా వెడల్పాటి గిన్నెలో మైదాపిండి, బియ్యం పిండి, వంట సోడా, ఉప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ,జీలకర్ర, పెరుగు, అల్లం, కొత్తిమీర, నీళ్ళు వేసి మరీ జారుగానూ కాకుండా గట్టిగానూ కాకుండా కలపాలి.స్టెప్-2:- ఈలోగా వెడల్పాటి గిన్నెలో మైదాపిండి, బియ్యం పిండి, వంట సోడా, ఉప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ,జీలకర్ర, పెరుగు, అల్లం, కొత్తిమీర, నీళ్ళు వేసి మరీ జారుగానూ కాకుండా గట్టిగానూ కాకుండా కలపాలి.
3
పిండిని కొంచెం తీసుకుని బోండాల్లా వేడి నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
కొబ్బరి పచ్చడితో కానీ పల్లీలపచ్చడి తో కానీ వడ్డించండి.
Tags
breakfast dish Breakfast Recipes home made mysore bonda home made mysore bonda in telugu how to make mysore bonda Kids breakfast mysore bonda mysore bonda at home mysore bonda in telugu Telugu Breakfast Recipes Telugu recipe Website telugu recipes Telugu Snack Recipes telugu tiffin recipes tiffin recipes tiffins