ఎగ్-లెస్కేక్పిల్లల వంటకాలుబేకరీ
ఆరెంజ్ కేక్
ఆరెంజ్ కేక్ | కేక్ పేరు వినగానే నోరూరుతుంది ఎవరికైనా,పుట్టిన రోజు,పెళ్లిరోజు,న్యూ ఇయర్ ఇలా ప్రత్యేకమైన సందర్బాలన్నీ కేక్ తో ముడిపడినవే.అలాంటి కేక్ ని ఇంట్లోనే చేసుకుని మీ రోజుని మరింత ప్రత్యేకంగా మార్చుకోండి. హోమ్ మేడ్ ఎగ్ లెస్ ఫ్రూట్ కేక్ ని తేలికగా తయారుచేసే పద్దతి మీకోసం….
కావలసిన పదార్థాలు:-
- మైదాపిండి: 1 1/2 కప్పులు
- వెన్న/నెయ్యి : పావు కప్పు
- పెరుగు: అర కప్పు
- పంచదార : ముప్పావు కప్పు
- బేకింగ్‌పౌడర్: అర టీస్పూన్
- బేకింగ్ సోడ/వంటసోడ : అర టీస్పూన్
- ఆరెంజ్ జ్యూస్ : అర కప్పు
- ఆరెంజ్ జెస్ట్ / తొక్క : అర టీస్పూన్
తయారుచేయు విధానం:-
1
ముందుగా ప్రెజర్ కుక్కర్ అడుగున వెన్న లేదా నెయ్యితో రాసి మైదాపిండి చల్లి పక్కన పెట్టుకోవాలి.
2
ఇప్పుడు ఒక గిన్నెలో నెయ్యి/వెన్న తీసుకొని బీట్ చేసుకోవాలి (గిలకొట్టాలి).తరువాత పంచదార,పెరుగు వేసి రంగు మారే వరకు బాగా బీట్ చేసుకోవాలి.
3
తరువాత మైదా,బేకింగ్‌పౌడర్,బేకింగ్ సోడా వేసి బాగా కలపిన తరువాత ఆరెంజ్ జ్యూస్ ,కచ్చాపచ్చాగా నలగొట్టిన ఆరెంజ్ తొక్క (ఆరెంజ్ జెస్ట్) ని వేసి బాగా కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని పిండి చల్లి ఉంచిన కుక్కర్‌లో పోసి మూతపెట్టాలి.విసిల్ పెట్టకూడదు.
4
తరువాత స్టవ్ పై నాన్ స్టిక్ పాన్ పెట్టి, దానిపై ప్రెజర్ కుక్కర్ పెట్టి,ముందు మూడు నిమిషాలు ఎక్కువ మంట మీద ఉంచి తరవాత సిమ్‌లో పెట్టి అరగంటసేపు ఉంచాలి.
5
౩౦ నిముషాల తరువాత టూత్ పిక్ కానీ చాక్ కానీ కేకు లో గుచ్చి చూడాలి.అది ఏమి అంటుకోకుండా ఉంటే స్టవ్ హాఫ్ చేసి, చల్లారిన తరువాత ప్లేట్లోకి తీసుకోవాలి.
రుచికరమైన హోమ్ మేడ్ కేక్ ని పిల్లలతో కలిసి ఆస్వాదించండి.
Tags
bakery recipe bakery recipes in telugu cake in telugu cake recipe in telugu eggless cake recipe in telugu home made cake home made cake in telugu home made orange cake home made orange cake in telugu orange cake orange cake in telugu orange cake recipe orange cake recipe in telugu telugu healthy recipes telugu home made cake telugu home made orange cake telugu kids recipes Telugu recipe Website telugu recipes Telugu Snack Recipes telugu vantala website Telugu Veg Recipes cake recipes