పిండి వంటలుప్రయాణ వంటకాలుస్నాక్స్
పప్పు చెక్కలు
పప్పుచెక్కలు ,వీటినిగారెలు,కట్టెగారెలు,కారంబిళ్ళలు అని కూడా పిలుస్తారు.ఇది తెలుగు వారి సాంప్రదాయక వేయించిన చిరుతిండి వంటకం.ఇవి కరకరలాడే రుచికరమైన చిరుతిండి. పండుగలు మరియు పిల్లల పాఠశాల సెలవుల్లో వీటిని తయారు చేస్తారు. చెక్కలు బియ్యం పిండి, చన్నా దాల్ మరియు సుగంధ ద్రవ్యాలు ఉపయోగించి తయారు చేస్తారు. అవి కర్ణాటక నిప్పట్టు మరియు తమిళనాడు తట్టై యొక్క వైవిధ్యం.
కావలసిన పదార్థాలు:-
- బియ్యపు పిండి : కేజీ
- పచ్చి సెనగపప్పు : 100గ్రా.
- పల్లీలు : 100గ్రా.
- నువ్వులు : 100గ్రా.
- కారం : 3 టీ స్పూన్లు
- ఉప్పు : 2 టీ స్పూన్లు
- తరిగిన కరివేపాకు : అర కప్పు
- తరిగిన పుదీనా : అర కప్పు
- తరిగిన కొత్తిమీర : అర కప్పు
- తరిగిన ఉల్లి కాడలు : అర కప్పు
- జీలకర్ర : 3 టీ స్పూన్లు
- పచ్చి మిర్చి : 6
- వెల్లుల్లి : 1
తయారుచేయు విధానం:-
1
పచ్చి సెనగపప్పుని గంట ముందు నానబెట్టుకోవాలి.
2
పచ్చిమిర్చి,జీలకర్ర,వెల్లుల్లి ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.నువ్వులు,పల్లీలను వేరు వేరుగా వేయించి,పల్లీల పొట్టుతీసి పెట్టుకోవాలి.
3
ఒక వెడల్పాటి బేసిన్ లో బియ్యప్పిండి,నానబెట్టిన సెనగపప్పు,వేయించిన పల్లీలు,నువ్వులు,గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్,సన్నగా తరిగిన పుదీనా,కరివేపాకు,కొత్తిమీర,ఉల్లికాడలు,కారం,ఉప్పు వేసి పిండిని బాగా కలుపుకోవాలి.
4
పూర్తిగా కలిపిన తరువాత తగినన్ని నీళ్లు పోసి ముద్దలా చేసి నిమ్మకాయ పరిమాణం/సైజ్ ఉండలుగా చేసుకుని ప్లాస్టిక్ కాగితం మీద నూనె రాసి గుండ్రని బిళ్లలుగా వత్తి కాగిన నూనెలో వేయించి తీయాలి. కరకరలాడే పప్పుచెక్కలు రెడీ.
చిట్కా:-
గాలి తగలకుండా ఉండే డబ్బాలో నిలువ ఉంచితే వారం పదిరోజుల వరకు ఉంటాయి.
Tags
chekkalu recipe with peanuts kaaram billalu in telugu karapu chekkalu recipe katte gaarelu in telugu pappu chekkalu in telugu pappu chekkalu recipe pappu chekkalu recipe andhra style pappuchekkalu rice crackers in telugu telugu kids recipes telugu pappuchekkalu Telugu recipe Website telugu recipes Telugu Snack Recipes telugu traditional recipes telugu vantalu