చట్నీస్

ఇన్స్టంట్ పల్లి చట్నీ

ఉదయన్నే ప్రతి ఇంట్లో మొదలయ్యే హడావుడి అల్పాహారం అదేనండీ బ్రేక్ ఫాస్ట్ కోసమే, ఆకలిగా లేకపోయినా, తినాలని లేకపోయినా సరే పల్లి చట్నీ చూడగానే, అందులోనూ దోశ, ఇడ్లీ, వడలకి పల్లి చట్నీ ఉంది అంటే చాలు ఆకలి అదే వచ్చేస్తుంది పిల్లలకి, పెద్దలకి.మరి అంత రుచికరమైన పల్లిల చట్నీ, ఆదివారం అంటే అంతా ఇంట్లోనే ఉంటారు కాబట్టి తాపీగా చేసుకోవచ్చు.
కానీ అది రోజు అంటే ఇబ్బందే ఒక రకంగా, అందులోనూ జాబ్ చేసే ఆడవాళ్ళు ఉన్న ఇంట్లో అయితే చాలా ఇబ్బందికారంగా ఉంటుంది. ఇటు టిఫిన్లు చేయడం, అటు లంచ్ బాక్స్ కోసం వంటలు, ఈ క్రమంలో ఇంట్లో అల్పాహారం చేయడం అనేది తగ్గుతూ వస్తుంది.
కొంతమందికి టిఫిన్, చట్నీ రెండు చేయడం ఇబ్బందిగా ఉంటుంది. అదే అప్పటికప్పుడు (ఇన్స్టంట్ )తేలికగా, గ్రైండ్ చేయాల్సిన పనిలేకుండా చట్నీ అయితే ఇంట్లో ఎవరైనా చేయవచ్చు. ఆ ఆలోచనతో వచ్చిందే ఇన్స్టంట్ పల్లి చట్నీ పొడి. ఒక్కసారి చేసిపెట్టుకుంటే, నెలరోజులవరకు ఉంటుంది.
అందులోనూ మామూలుగా చేసే చట్నీ రుచితో మరియు తాజాగా చేసిన అనుభూతిని ఇస్తుంది. మరి ఎందుకింకా ఆలస్యం మీరు ప్రయత్నించండి..

కావలసిన పదార్థాలు:-

తయారుచేయు విధానం:-

1

కడాయి లేదా నాన్ స్టిక్ పాన్ స్టవ్ పై పెట్టి వేడైన తరువాత పల్లీలు వేసి చిన్న మంట పైన వేయించుకోవాలి.

2

పల్లీలు దోరగా అయిన తరువాత పుట్నాలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు,జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వేసి కలుపుతూ కరివేపాకు పచ్చిదనం పోయేంతవరకు వేయించుకోవాలి.

3

చేతితో ఒత్తినపుడు పొడి పొడిగా అయినప్పుడు, స్టవ్ ఆపేసి చల్లపరచుకోవాలి.పల్లిల మిశ్రమం చల్లబడిన తరువాత మిక్సీలో వేసి, పొడిగా చేసుకోవాలి.

4

తాలింపు కోసం ఒక పెనంలో నూనె పోసి వేడి అయిన తరువాత ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు బాగా వేగిన తరువాత పసుపు వేసి కలపాలి.

5

స్టవ్ ఆపేసి, ఈ పోపును గ్రైండ్ చేసుకున్న చట్నీ పొడిలో వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పువేసి బాగా కలుపుకుని, గాలి చొరబడని డబ్బాలో పోసి నిలువ చేసుకుంటే నెల రోజుల వరకు తాజాగా ఉంటుంది.

6

మనకు అవసరమైనపుడు, బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, దోశ చేసుకున్నప్పుడు, ఒక గిన్నెలో 4 లేదా 5 స్పూన్ల పొడి తీసుకుని కొద్ది కొద్దిగా నీళ్ళు కలుపుతూ బాగా కలుపుకుంటే చాలా రుచికరమైన ఇన్స్టంట్ చట్నీ రెడీ. 

మరికొన్ని వంటకాలు మీకోసం :-

మామిడికాయ పచ్చడి 


చికెన్ పచ్చడి 

Show More

Leave a Reply

Back to top button
error: Content is protected !!