అల్పాహారంటిఫిన్స్పిల్లల వంటకాలువెజ్స్నాక్స్

పోంగనాలు

పోంగనాలు | పొంగనాలను కొన్ని ప్రాంతాల్లో పనియారం అని గుంతపొంగనాలు అని పిలుస్తారు.ఇది చాలా తేలికైన వంటకం.వీటిని ఇడ్లీ లేదా దోసెపిండితో కూడా వేసుకోవచ్చు.వేరు వేరు పద్దతులతో చేస్తారు.అల్పాహారంగాను,స్నాక్స్ గాను తింటారు.

కావలసిన పదార్థాలు:-

తయారుచేయు విధానం:-

1

మినప్పప్పు కడిగి సుమారు నాలుగు గంటలపాటు నానబెట్టాలి.

2

తరవాత మెత్తగా గ్రైండ్ చేసుకుని అందులో ఇడ్లి రవ్వ కలపిన ఈ పిండిని ఎనిమిది గంటలపాటు పులియనివ్వాలి.

3

తరవాత సన్నగా తరిగిన ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకులను , పిండిలో కలపాలి. తగినంత ఉప్పుని కలుపుకోవాలి

4

పొంగనాల పెనాన్ని స్టవ్‌మీద పెట్టి ఒక్కో గుంతలో రెండుమూడు చుక్కల నూనె వేసి, పిండి మిశ్రమాన్ని వేసి మూతపెట్టి ఓరెండు నిముషాల పాటు చిన్న మంటపై ఉడకనివ్వాలి.

5

తరవాత స్పూనుతో పొంగనాలను నెమ్మదిగా రెండో వైపునకు తిప్పాలి. ఇలా రెండు వైపులా చిన్న మంట మీద ఉడికించి దించితే పొంగనాలు రెడీ.
Show More

Leave a Reply

Back to top button
error: Content is protected !!