స్వీట్స్
రవ్వ లడ్డు
రవ్వలడ్డు అన్ని పండుగలకు దాదాపు ప్రతి గృహంలో తయారు చేయబడే ఒక ప్రసిద్ధ వంటకం. రవ్వ లడ్డు ఒక సాధారణ మరియు సులభమైన వంటకం దీనిని వేయించిన రవ్వ(సూజి), కొబ్బరి, నెయ్యి, చక్కెర, తో తయారు చేస్తారు.
కావలసిన పదార్థాలు:-
- బొంబాయి రవ్వ : రెండు కప్పులు
- పంచదార : కప్పున్నర
- కొబ్బరి పొడి : పావు కప్పు
- యాలకుల పొడి : పావు స్పూన్
- బాదంపప్పు : పావు కప్పు
- పాలు : పావు కప్పు
- నెయ్యి : తగినంత
తయారుచేయు విధానం:-
1
స్టౌ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టి టేబుల్ స్పూన్ నెయ్యి వేసి రవ్వ వేయించుకోవాలి. అందులో కొబ్బరి పొడి ,బాదం పొడి, యాలకుల పొడి వేసి దోరగా వేయించుకోవాలి.
2
తరువాత పంచదార కూడా వేసి బాగా కలపాలి. పంచదార కొంచెం కరగగానే కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
3
ఇప్పుడు రవ్వ మిశ్రమాన్ని వేరే ప్లేట్ లోకి తీసుకొని పాలు అవసరమైనంత కొద్దికొద్దిగా కలుపుతూ ఉండలుగా చుట్టుకోవాలి.
నోరూరించే ఈ రుచికరమైన రవ్వ లడ్డు తయారచేసి మీ కుటుంబంతో ఆస్వాదించండి.