హెల్తీ బెల్లం పూరి
మన సంప్రదాయంలో బెల్లంతో చేసే స్వీట్స్ ప్రత్యేకమైనవి. ఈరోజు పూరిలను బెల్లంతో తయారుచేసుకుందాం. ఆరోగ్యకరమైన మల్టిగ్రైన్, బెల్లంతో తయారవుతుంది కాబట్టి ఈ పూరి టేస్టీగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి మంచిది ఈ రెసిపి టీ టైమ్ కి గాని, పిల్లలకు స్నాక్‌గా పర్ఫెక్ట్ ఉంటుంది.

క్లుప్తంగా

తయారీ విధానం
ఒక గిన్నెలో బెల్లం తీసుకుని, కొంచెం నీరు కలిపి వేడి చేయాలి. బెల్లం పూర్తిగా కరిగిన తరువాత, వడపోసి పక్కన పెట్టాలి.
ఇప్పుడు పిండిని తీసుకుని అందులో యాలకుల పొడి వేసి కలపాలి. తరువాత బెల్లం నీరు పోస్తూ ముద్దలా కలపాలి. చివరగా నెయ్యి వేసి సాఫ్ట్ డోలా చేయాలి
కలిపిన పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకుని, పూరీలు చేసుకోవాలి.
నూనె వేడి చేసి మీడియం మంట పై పూరీలు వేయించాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేయాలి. వేడిగా ఉండగానే పూరీలను వడ్డించుకోవాలి.
ఈ వంటకం గురించి
సర్వింగ్ సూచనలు
- ఈ పూరీలు వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది
- పాలు లేదా టీతో సర్వ్ చేస్తే ఇంకా బాగుంటుంది