మాంసాహారంనాన్ వెజ్ కర్రీస్తెలంగాణ వంటకం

తెలంగాణ స్టైల్ చేపల ఫ్రై | ఇంట్లోనే స్పైసీ చేపల వేపుడు

తెలంగాణ వంటకాలు అంటేనే మసాలా మ్యాజిక్! ఘాటు, ఫ్లేవర్, టేస్ట్ - అన్నీ ఒకే ప్లేట్‌లో కలిసినట్టు ఉంటుంది. అలాంటి ఫుల్ ఫ్లేవర్‌తో చేసే తెలంగాణ స్టైల్ చేపల ఫ్రై, సింపుల్ ఇంగ్రిడియెంట్స్‌తో ఇంట్లోనే ఈజీగా చేసేయండి

telangana style fish fry
తయారీ10 నిమిషాలు
వంట15 నిమిషాలు
మొత్తం సమయం35 నిమిషాలు
ఎంత మందికి3 మందికి
కష్టంసులువు
వంటకానికి వెళ్లండి

వంట మోడ్

తెలంగాణ స్టైల్ చేపల ఫ్రై | ఇంట్లోనే స్పైసీ చేపల వేపుడు

దశ 1 / 6

చేప ముక్కలను శుభ్రంగా కడిగి నీరు పూర్తిగా వడకట్టాలి.

కావాల్సిన పదార్థాలు
  • 250 గ్రాములు చేప ముక్కలు
  • 1/4 టీ స్పూన్ పసుపు
  • 1½ టీ స్పూన్లు కారం పొడి
  • తగినంత ఉప్పు
  • 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి
  • 1 టీ స్పూన్ ధనియాల పొడి
  • 1 టీ స్పూన్ నిమ్మరసం
  • 1/2 టేబుల్ స్పూన్ గరం మసాల
  • కొద్దిగా కొత్తిమీర
  • 1 టీ స్పూన్ అల్లం–వెల్లుల్లి పేస్ట్
  • ఫ్రై చేయడానికి సరిపడా నూనె

క్లుప్తంగా

తెలంగాణ వంటకాలు అంటేనే మసాలా మ్యాజిక్! ఘాటు, ఫ్లేవర్, టేస్ట్ - అన్నీ ఒకే ప్లేట్‌లో కలిసినట్టు ఉంటుంది. అలాంటి ఫుల్ ఫ్లేవర్‌తో చేసే తెలంగాణ స్టైల్ చేపల ఫ్రై, సింపుల్ ఇంగ్రిడియెంట్స్‌తో ఇంట్లోనే ఈజీగా చేసేయండి

తయారీ విధానం

  1. చేప ముక్కలను శుభ్రంగా కడిగి నీరు పూర్తిగా వడకట్టాలి.

  2. ఒక బౌల్‌లో చేప ముక్కలు తీసుకుని వాటిపై పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాల, జీలకర్ర మెంతుల పొడి, అల్లం–వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసి కలిపి ముక్కలకు పూతలా పట్టించాలి.

  3. ఈ మసాలలు పట్టించిన చేప ముక్కలను 10 నిముషాల పాటు పక్కన పెట్టాలి.

  4. ఆ తరువాత పాన్‌లో నూనె వేసి వేడి చేసి, చేప ముక్కలను వేసి మీడియం మంట మీద నెమ్మదిగా ఫ్రై చేయాలి.

  5. ఒక వైపు వేగిన తరువాత తిప్పి, రెండో వైపు కూడా వేగేదాక వేయించాలి.

  6. చివర్లో కొత్తిమీర వేసి మరోసారి ముక్కలను తిప్పి, కొత్తిమీర వేగాక స్టౌవ్ ఆఫ్ చేయాలి. అంతే నోరూరించే ఉండే చేపల ఫ్రై రెడీ.

ఈ వంటకం గురించి

వేడి అన్నం లేదా రాగి సంగటి తో సర్వ్ చేస్తే అదిరిపోతుంది