రొయ్యల వేపుడు – ఇంట్లోనే హోటల్ స్టైల్
పోషక విలువలతో పాటు అద్భుతమైన రుచి కలిగిన రొయ్యల వేపుడును ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ లో తక్కువ సమయంలో తయారుచేసుకోవచ్చు. తాజా రొయ్యలు, కారం, మసాలా కలిపి చేస్తే వచ్చే సూపర్ టేస్ట్‌ను ఎవ్వరూ కాదనలేరు. ఈ రొయ్యల వేపుడు అన్నంలో అయినా… రోటీతో తిన్నా… చాలా రుచిగా ఉంటుంది.

క్లుప్తంగా

తయారీ విధానం
రొయ్యలు మెరినేట్ చేయడం: శుభ్రం చేసిన రొయ్యల్లో కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసి 10–15 నిమిషాలు మారినేట్ చేయండి.
ఫ్రై చేయడం: పాన్‌లో నూనె వేసి వేడి అయిన తరువాత మారినేట్ చేసిన రొయ్యల వేయించుకోవాలి. వేగినతరువాత తీసి పక్కన పెట్టాలి.
మసాలా తయారీ: 2 టేబుల్ స్పూన్ల నూనెలో కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాసన పోయే వరకు వేయించాలి. ఆ తర్వాత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి.
రొయ్యలు కలపడం: ఇప్పుడు వేయించిన రొయ్యలు వేసి మీడియం మంటపై 5–7 నిమిషాలు ఉడికించాలి. రొయ్యలలోని నీరు పోయి డ్రై అయ్యే వరకు వేయించండి.
ఫైనల్ టచ్: చివరిగా గరం మసాలా, నిమ్మరసం(ఆప్షనల్) వేసి కలిపి కొత్తిమీరతో అలంకరించండి.
ఈ వంటకం గురించి
సర్వింగ్ సూచనలు
- వేడి వేడి అన్నం + నెయ్యి తో అద్భుతంగా ఉంటుంది
- రోటీ, చపాతీకి కూడా బాగా సరిపోతుంది