శాకాహారంకేకులు

సాఫ్ట్ చాక్లెట్ కేక్ (విత్ అవుట్ ఓవెన్)

ఇంట్లోనే ఓవెన్ తో పనిలేకుండా స్టవ్ పైనే సులభంగా చేసుకునే మెత్తటి స్పాంజీ చాక్లెట్ కేక్ తయారీ విధానం మీకోసం. తక్కువ పదార్థాలతో, పిల్లలు చాలా ఇష్టపడే చాక్లెట్ కేక్ ను మీరు ట్రై చేయండి.

సాఫ్ట్ చాక్లెట్ కేక్ (విత్ అవుట్ ఓవెన్)
తయారీ15 నిమిషాలు
వంట40 నిమిషాలు
మొత్తం సమయం1 గంట 5 నిమిషాలు
ఎంత మందికి6 మందికి
కష్టంమధ్యస్థం
వంటకానికి వెళ్లండి

వంట మోడ్

సాఫ్ట్ చాక్లెట్ కేక్ (విత్ అవుట్ ఓవెన్)

దశ 1 / 9

ఒక గిన్నెలో మైదా, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి ఒకసారి జల్లెడ పట్టాలి. ఇలా చేస్తే కేక్ మెత్తగా వస్తుంది.

కావాల్సిన పదార్థాలు
  • 1 ½ కప్పు మైదా
  • 3 టేబుల్ స్పూన్లు కోకో పౌడర్
  • ½ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్
  • ¾ కప్పు పంచదార
  • ¼ కప్పు నెయ్యి
  • ¾ కప్పు పెరుగు
  • ¼ కప్ పాలు

క్లుప్తంగా

ఇంట్లోనే ఓవెన్ తో పనిలేకుండా స్టవ్ పైనే సులభంగా చేసుకునే మెత్తటి స్పాంజీ చాక్లెట్ కేక్ తయారీ విధానం మీకోసం. తక్కువ పదార్థాలతో, పిల్లలు చాలా ఇష్టపడే చాక్లెట్ కేక్ ను మీరు ట్రై చేయండి.

తయారీ విధానం

  1. ఒక గిన్నెలో మైదా, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి ఒకసారి జల్లెడ పట్టాలి. ఇలా చేస్తే కేక్ మెత్తగా వస్తుంది.

  2. మరొక గిన్నెలో నెయ్యి మరియు పంచదార వేసి క్రీమీగా కలపాలి. తర్వాత పెరుగు వేసి బాగా బీట్ చేయాలి. మిశ్రమం స్మూత్‌గా మారుతుంది.

  3. ఇప్పుడు డ్రై మిక్స్‌ను కొంచెం కొంచెంగా వెట్ మిక్స్‌లో కలుపుతూ సున్నితంగా కలపాలి. మిశ్రమం ఎక్కువ గట్టిగా ఉంటే కొద్దిగా పాలు కలుపుకోవాలి. గడ్డలు లేకుండా, రిబ్బన్ లాంటి కన్సిస్టెన్సీ వచ్చేవరకు కలపాలి. మరీ ఎక్కువగా కలపకండి.

  4. స్టౌవ్‌పై బేక్ చేసే విధానం: వెడల్పాటి, మందపాటి గిన్నెను స్టౌవ్‌పై పెట్టి, అందులో టేబుల్ సాల్ట్ వేసి 5–7 నిమిషాలు లో ఫ్లేమ్‌లో వేడి చేయాలి.

  5. దాని లోపల ఒక స్టాండ్ లేదా చిన్న ప్లేట్ పెట్టాలి.

  6. ఇప్పుడు కేక్ టిన్‌కు నెయ్యి లేదా నూనె రాసి కొద్దిగా మైదాను చల్లాలి.

  7. ఆ తరువాత టిన్‌లో రెడీ చేసి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని పోసి, 2,3 సార్లు తట్టాలి (టాప్ చేయాలి). దీనిని ముందుగా వేడి చేసిన గిన్నెలో స్టాండ్ పై ఉంచాలి.

  8. గిన్నె పై మూత పెట్టి పూర్తిగా కవర్ చేసి, చిన్న మంట పై 35–40 నిమిషాలు పెట్టాలి. అంతే నోరూరించే చాక్లెట్ కేక్ రెడీ.

  9. చెక్ చేసే విధానం: టూత్‌పిక్‌తో కేక్ ను గుచ్చి చూడాలి. ఏమీ అంటుకోకుండా వస్తే కేక్ సిద్ధం. గ్యాస్ ఆఫ్ చేసి 10 నిమిషాలు అలాగే ఉంచి, చల్లారిన తర్వాత బయటకు తీసుకోవాలి.

ఈ వంటకం గురించి

సర్వింగ్ ఐడియా

కేక్ పైన కొంచెం చాక్లెట్ సాస్ లేదా పౌడర్ షుగర్ చల్లితే ఇంకా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.