Home / ఎగ్/ 🍗🍚 స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెసిపీ

🍗🍚 స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెసిపీ

February 2, 2026 9:37 pm
|
By

“ఈ స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ సాధారణంగా హోటళ్లలో దొరికే చికెన్ ఫ్రైడ్ రైస్‌కి భిన్నంగా ఉంటుంది. ఇంకా రుచిగా కూడా ఉంటుంది. ఇంట్లో పార్టీ మెనూకైనా, ప్రత్యేక రోజుకైనా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది!” 😋🍗🍚


📝 కావలసిన పదార్థాలు

  • ఉడికించిన అన్నం – 2 కప్పులు (చల్లారినవి అయితే బెస్ట్)

  • చికెన్ (బోన్‌లెస్) – 200 గ్రా (చిన్న ముక్కలుగా)

  • నూనె – 2 టేబుల్ స్పూన్లు

  • గుడ్లు – 2
  • వెల్లుల్లి – 1 టేబుల్ స్పూన్ (సన్నగా తరిగినది)

  • ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది)

  • క్యారెట్ – 2 టేబుల్ స్పూన్లు (చిన్న ముక్కలు)

  • గ్రీన్ చిల్లీస్ – 1–2 (సన్నగా)

  • సోయా సాస్ – 1 టీ స్పూన్

  • గ్రీన్ చిల్లీ సాస్ – టీ స్పూన్
  • వెనిగర్ – 1 టీ స్పూన్

  • మిరియాల పొడి – ½ టీ స్పూన్

  • ఉప్పు – తగినంత

  • స్ప్రింగ్ ఆనియన్ – కొద్దిగా

  • కొత్తిమీర – 2 టీస్పూన్
  • కారం పొడి – 1 టీస్పూన్
  • దనియాల పొడి – టీస్పూన్
  • గరం మసాల – టీస్పూన్
  • అల్లం పేస్ట్ – టీస్పూన్
  • కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్
  • నూనె – వేయించడానికి

    🍗 దేశీ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం

    ముందుగా చికెన్‌ను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసుకోండి. అందులో గరం మసాలా, ధనియాల పొడి, కారం పొడి, అల్లం పేస్ట్, మరియు కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని సుమారు 30 నిమిషాలు పక్కన పెట్టి మెరినేట్ అవ్వనివ్వాలి.

    30 నిమిషాల తర్వాత ఒక కడాయిలో నూనె వేడి చేసి, మోస్తరు మంటపై చికెన్ ముక్కలను డీప్ ఫ్రై చేయాలి. చికెన్ కరకరలాడేలా వేయించాక నూనె నుంచి తీసి పక్కన పెట్టాలి.

    ఇప్పుడు మరో పాన్‌లో 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి, మంట ఎక్కువగా పెట్టాలి. అందులో గుడ్లు వేసి త్వరగా కలుపుతూ చిన్న చిన్న ముక్కలుగా వేయించాలి. దానిని పక్కకు జరిపి అందులోనే తరిగిన వెల్లుల్లి, పచ్చి మిర్చి, ఉల్లిపాయలు వేసి హై ఫ్లేమ్ లో వేగంగా కలపాలి.

    తర్వాత తరిగిన కూరగాయలు వేసి హై ఫ్లేమ్ లో టాస్ చేయాలి. ఇప్పుడు ఉడికించిన అన్నం వేసి, కారం పొడి, ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి.

    దీనిలో గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్ వేసి 5 నిమిషాలు గట్టిమంటపై టాస్ చేయాలి. చివరగా వేయించిన చికెన్ వేసి మళ్లీ ఒకసారి కలపాలి.

    పైన స్ప్రింగ్ ఆనియన్ మరియు కొత్తిమీర చల్లి వేడి వేడిగా సర్వ్ చేయండి. ఇలా చేస్తే రోడ్డు పక్క స్టాల్ రుచితో, పాటు హైజీన్‌తో ఇంట్లోనే రుచికరమైన చికెన్ ఫ్రైడ్ రైస్ సిద్ధం! 😋🍚