సేమియా వడ | క్రంచీ టీ టైమ్ స్నాక్. సేమియాకు బదులుగా నూడిల్స్‌ను కూడా వాడుకోవచ్చు. ఇది తేలికగా చేసుకునే రుచికరమైన వంటకం.ఈ చిరుతిండిని వేడిగా వడ్డించాలి.
కావలసిన పదార్థాలు:-
- ఉడికించిన సేమియా : కప్పు
- మైదా : అరకప్పు
- శనగ పిండి : పావుకప్పు
- బియ్యపు పిండి : పావుకప్పు
- ఉల్లిపాయల తరుగు :అర కప్పు
- పచ్చిమిర్చి : నాలుగు
- కొత్తిమీర : రెండు టేబుల్ స్పూన్లు
- కరివేపాకు : ఒక రెబ్బ
- అల్లం : చిన్న ముక్క
- జీలకర్ర : అరస్పూన్
- కారం : పావు స్పూన్
- ఉప్పు : తగినంత
- నూనె : వేయించడానికి సరిపడా
తయారుచేయు విధానం:-
1
ఒక వెడల్పాటి గిన్నెలో ఉడికించిన సేమియా,సన్నగా తరిగిన అల్లం,పచ్చిమిర్చి,ఉల్లిపాయముక్కలు,కొత్తిమీర,కరివేపాకు,జీలకర్ర,కారం,ఉప్పు,మైదా,శనగ పిండి,బియ్యపు పిండి వేసి బాగా కలుపుకోవాలి.
2
కడాయి లో వేయించడానికి నూనె తీసుకుని వేడి అయిన తరువాత వడల్లా తట్టుకుని నూనెలో వేసి వేయించుకోవాలి.
వీటిని వేడివేడిగా పుదీనా చట్నీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.
Tags
Breakfast Recipes homemade semiyavadalu Kids snacks semiyavadalu semiyavadalu in telugu semiyavadalu recipe Snack Recipes snack recipes in telugu snacks Telugu Breakfast Recipes telugu kids recipes Telugu recipe Website telugu recipes Telugu Snack Recipes telugu tiffin recipes telugu vantala website telugu vantalu telugu vantalu at home Telugu Veg Recipes vermicelli vermicelli vadalu vermicelli vadalu in telugu