పిండి వంటలుపిల్లల వంటకాలుస్వీట్స్
సున్నండలు తెలుగు ప్రజల సంప్రదాయ వంటకం. సాధారణంగా ఇవి చక్కెరతో తయారవుతాయి, కానీ పంచదార కన్నా బెల్లం ఎంతో మంచిది. రుచికరంగా కూడా ఉంటాయి. కాబట్టి బెల్లంతో ప్రయత్నించండి. పాలిచ్చే తల్లులకు మరియు బలహీనంగా ఉన్న పిల్లలకు ఇవి చాలా మంచి పోషకాలను అందిస్తాయి.
మినప్పప్పు ను దోరగా వేయించి చల్లారిన తరువాత పొడి చేసుకోవాలి.
సున్నుండలకోసం చేసిన పొడి ఆరు నెలల వరకు కూడా నిలవ ఉంటుంది. గాలి చొరబడకుండా ఉండే డబ్బాలో నిలువ ఉంచాలి.
ఎక్కువ మొత్తంలో పొడి చేసి పెట్టుకుంటే అవసరమైనపుడు తీసుకొని నెయ్యి వేడిచేసి కలిపి సున్నుండలు చేసుకుంటే తాజాగా ఉంటాయి.
మేము కచ్చితంగా మీ మెయిల్ బాక్స్ ని స్పామ్ చేయము .