Home / నైవేద్యం/ 🥕✨నోరూరించే హెల్తీ “క్యారెట్ రవ్వలడ్డు” స్వీట్ షాప్ స్టైల్ లో..😍

🥕✨నోరూరించే హెల్తీ “క్యారెట్ రవ్వలడ్డు” స్వీట్ షాప్ స్టైల్ లో..😍

June 25, 2026 4:25 pm
|
By

రవ్వలడ్డు పేరు వినని తెలుగు వారు ఉండరని చెప్పవచ్చు. ఇక తెలంగాణ కుటుంబాల్లో ఈ స్వీట్ తరతరాలుగా తయారవుతున్న సంప్రదాయమైన తీపి వంటకం. అందరికీ అందుబాటులో ఉండే సాధారణ పదార్థాలతో చేసే ఈ లడ్డు రుచిలోనే కాదు, కుటుంబ అనుబంధాల జ్ఞాపకాలతో ప్రత్యేక గుర్తింపును పొందింది. ముఖ్యంగా పండుగలు, పూజలు, శుభకార్యాలు, అతిథులు వచ్చినపుడు తక్కువ సమయంలో చేసే మిఠాయిగా రవ్వలడ్డు నిలిచింది. 

సంప్రదాయ రవ్వలడ్డుకు మరింత రుచి, మరియు ఆరోగ్యం కోసం క్యారెట్ తో చేద్దాం. క్యారెట్ తినని వారు కూడా ఈ లడ్డును ఎంజాయ్ చేస్తారు. మెత్తగా, నోట్లో వేసుకోగానే  కరిగిపోయే రుచి.
నెయ్యి మరియు యాలకుల సువాసన కలిసి ఈ క్యారెట్ రవ్వలడ్డూలు ఒక్కసారి తింటే మళ్లీ తినాలనిపిస్తుంది. 

🌼 కావలసినవి:

•బొంబాయి రవ్వ – 2 కప్పులు
• క్యారెట్ తురుము – 2 కప్పులు
• పాలు – తగినన్ని
• చక్కెర – 1.5 కప్పులు
• నెయ్యి – 8 స్పూన్లు
• యాలకుల పొడి – పావు టీ స్పూన్
• జీడిపప్పు / కిస్మిస్(ఆప్షనల్)

👩‍🍳 తయారు చేసే విధానం:-

🔸 స్టెప్ 1: ముందుగా జీడిపప్పు, కిస్మిస్ ను నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోవాలి.
🔸 స్టెప్ 2: ఇప్పుడు అదే కడాయిలో ఉన్న నెయ్యిలో రవ్వను వేయించుకోవాలి. రవ్వ వేగిన తరువాత అందులోనే  తురుముకున్న క్యారెట్ ను వేసి కలపాలి.
🔸 స్టెప్ 3:  3–4 నిమిషాల పాటు రవ్వ, క్యారెట్ తురుమును కలుపుతూ వేయించుకోవాలి.
🔸 స్టెప్ 4: ఆ తరువాత పంచదార వేసి బాగా కలపాలి. ఆ తరువాత యాలకుల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
🔸 స్టెప్ 5: వేరే గిన్నెలోకి తీసుకుని, డ్రైఫ్రూట్స్ వేసి కలిపి, ఆ మిశ్రమంలో కొంచెం కొంచెంగా పాలు పోస్తూ కలిపి లడ్డులా చుట్టుకోవాలి. ✨

“క్యారెట్ రవ్వలడ్డు రెసిపీ” గురించి తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs):-

1. ఈ లడ్డు చేయడానికి ఏ రవ్వ వాడాలి?

బొంబాయి రవ్వను ఉపయోగిస్తే లడ్డూలు సాఫ్ట్ గా, రుచిగాను వస్తాయి.

2. పంచదార కాకుండా బెల్లంతో చేయవచ్చా?

చేయవచ్చు. పంచదార కన్నా బెల్లం ఉపయోగిస్తే రవ్వలడ్డు మరింత ఆరోగ్యకరంగా మారుతుంది.

3. ఉడికించిన క్యారెట్‌ను వాడాలా?

లేదు. తాజాగా క్యారెట్‌ తురిమి నెయ్యిలో రావవతో పాటు వేయించితే సరిపోతుంది.

4. క్యారెట్ రవ్వలడ్డూలు ఎంతకాలం నిల్వ ఉంటాయి?

గది ఉష్ణోగ్రతలో గాలి చొరబడకుండా ఉండే డబ్బాలో అయితే 2–3 రోజులు, రిఫ్రిజిరేటర్ లో అయితే 5–7 రోజుల వరకు ఉంటాయి.

5. కొన్నిసార్లు లడ్డూలు ముద్ద కట్టకుండా ఎందుకు విడిపోతాయి?

లడ్డు మిశ్రమంలో తేమ తగ్గడం వల్ల /నెయ్యి తగినంత వేయకపోవడంవల్ల విడిపోతుంది. అలాంటి సందర్భంలో వేడి పాలు లేదా కరిగించిన నెయ్యి కొద్దిగా కలిపి మళ్లీ లడ్డూలు చేసుకోవచ్చు.