Home / స్వీట్స్/ పండుగలకు పర్ఫెక్ట్ స్వీట్ – ఇంట్లోనే సులభంగా చేసే రవ్వలడ్డు

పండుగలకు పర్ఫెక్ట్ స్వీట్ – ఇంట్లోనే సులభంగా చేసే రవ్వలడ్డు

March 6, 2026 4:22 pm
|
By

ఇది అన్ని ఉత్సవాలకు దాదాపు ప్రతి గృహంలో తయారు చేయబడే ఒక ప్రసిద్ధ వంటకం. రవ్వ లడ్డుఒక సాధారణ మరియు సులభమైన వంటకం దీనిని వేయించిన రవ్వ(సూజి), కొబ్బరి, నెయ్యి, చక్కెరలతో తయారు చేస్తారు.

కావలసిన పదార్థాలు: 

బొంబాయి రవ్వ – రెండు కప్పులు,

నెయ్యి – ఒక కప్పు,

పంచదార – ఒక కప్పున్నర,

జీడిపప్పు – పావుకప్పు,

బాదంపప్పు – పావు కప్పు,

పాలు – పావు కప్పు.

తయారుచేయు విధానం:

స్టెప్-1: స్టౌ మీద మందపాటి గిన్నె పెట్టి ఒక టేబుల్‌స్పూను నెయ్యి వేసి అందులో రవ్వ వేసి వేయించుకోవాలి.

స్టెప్ -2: రవ్వ వేగిన తరువాత అందులోనే కొబ్బరి పొడి, కచ్చపచ్చగా చేసిన బాదం పొడి, యాలకుల పొడి  వేసి  దోరగా వేయించుకోవాలి.

స్టెప్ -3: తరువాత రవ్వ మిశ్రమాన్ని వేరే ప్లేట్ లోకి తీసుకొని, నెయ్యిలో వేయించిన జీడిపప్పును వేసి, కొద్దికొద్దిగా పాలు కలుపుతూ ఉండలుగా చుట్టుకోవాలి. అంతే రుచికరమైన రవ్వలడ్డు రెడీ.

🍫 సాఫ్ట్ చాక్లెట్ కేక్ (విత్ అవుట్ ఓవెన్)