రసం / సాంబార్

టమాటా రసం

రసం లేదా చారు దక్షిణభారతీయ వంటకం. ముఖ్యంగా తెలుగు ఇళ్ళలో దాదాపు  ప్రతిరోజూ కనిపించే వంటకం. రసం  వేరు వేరు పద్దతులలో చేస్తారు.  చెప్పాలంటే ఒక్కో చేతిలో ఒక్కో రుచి వస్తుంది. అయినా కూడా ప్రతిదీ ప్రత్యేకమైన రుచిలో ఉంటుంది. అలా రసం మన ఆహారంలో ముఖ్యపాత్ర  పోషిస్తోందని చెప్పక తప్పదు.

రసం / చారు రకాల్లో టమాటచారు ప్రత్యేకమైనది. ఇది పుల్లగా మరియు స్పైసీగా  ఉంటుంది. వివిధ రకాల మసాలా దీనుసులని వేయించి, చేసిన పొడితో తయారుచేస్తారు. వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటారు. ముఖ్యంగా జ్వరం కానీ, అనారోగ్యంగా ఉన్నప్పుడు పిల్లలకి , పెద్దలకి  టమాటా రసంతో పెడతారు.

మా పెద్దమ్మ టమాట చారు చాలా టేస్టిగా చేసేవారు. ఎవరికైనా జ్వరం అంటే మా పెద్దమ్మ టమాట చారు చేయాల్సిందే. తాను చారు చేస్తుంటే, వచ్చే ఆ వాసనకి  చుట్టుపక్కన వాళ్ళకి కూడా నోరూరేది. ఇప్పటికీ టమాటా చారు అంటే తనే గుర్తొస్తుంది.

ఈ రసంలో పప్పుపొడి ఉపయోగించలేదు. మరింత చిక్కదనం కావాలనుకుంటే కందిపప్పు పొడిని  కలుపుకోవచ్చు. ఇది చాలా తేలికగా చేయగలిగిన రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన వంటకం. టమాట రసం ఎలా చేయాలో తెలిపే వీడియో మరియు వివరణ స్టెప్ బై స్టెప్ లో చూడండి.   

కావలసిన పదార్థాలు:-

తయారుచేయు విధానం:-

1

వెడల్పాటి గిన్నెలో నూనె లేదా నెయ్యి వేసుకుని, వేడైన తరువాత జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, బిర్యానీ ఆకు,పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి.

2

పచ్చిమిర్చి వేగిన తరువాత టమాట ముక్కలు వేసి కలిపి, కొంచెం ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి, మూత పెట్టి,  రెండు నిముషాలపాటు, చిన్న మంటపై ఉడకనివ్వాలి.

3

రెండు నిముషాల తరువాత మూత తీసి కచ్చపచ్చగా చేసిన వెల్లుల్లి, సాంబార్ మసాలా, చింతపండు రసం వేసి బాగా కలుపుకుని మరో రెండు నిముషాలు ఉడకనివ్వాలి.

4

టమాటాలు మగ్గిన తరువాత నీళ్ళు పోసి, కలిపి బాగా మరగనివ్వాలి. టమాట రసం మరుగుతున్నపుడు మిరియాల పొడి వేసుకోవాలి.

5

టమాట రసంను చిన్న మంట పై చేసుకుంటే చాలా రుచిగా వస్తుంది. మరిగిన తరువాత కొత్తిమీర వేసుకుని, స్టవ్ ఆపేయాలి.
వేడి వేడి అన్నంలో టమాట రసం వేసుకుని తింటే  చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకి బాగా నచ్చుతుంది.   

మీకోసం మరి కొన్ని వంటలు 

ముల్లంగి ఉలవ రసం

పన్నీర్ బటర్ మసాల

Show More

Leave a Reply

Back to top button
error: Content is protected !!