Home / వెజ్ కర్రీస్/ 🍲 తెలంగాణ స్పెషల్ కందదుంప పులుసు 😋

🍲 తెలంగాణ స్పెషల్ కందదుంప పులుసు 😋

April 4, 2026 3:44 pm
|
By

తెలంగాణ వంటల్లో పులుసులకి ప్రత్యేక స్థానం ఉంది. అందులో కందదుంప పులుసు ఒక రుచికరమైన గ్రామీణ వంటకం 💛. చింతపండు పులుపు, మసాలాల ఘాటు, కందదుంప సాఫ్ట్ టెక్స్చర్—అన్ని కలిపి అద్భుతమైన రుచిని ఇస్తాయి. ఈ పులుసు అన్నంతో తింటే చాలా బాగుంటుంది 😍

🛒 కావలసిన పదార్థాలు

  • కందదుంప (పుల్లకంద) – 500గ్రాములు
  • ఉల్లిపాయ – 2 (తరిగినది)
  • పచ్చిమిర్చి – 5
  • చింతపండు – నిమ్మకాయ సైజు
  • జీలకర మెంతుల పొడి – 1 టీ స్పూన్
  • మిర్చి పొడి – 1 టీ స్పూన్
  • ధనియాల పొడి – 1 టీ స్పూన్
  • పసుపు – పావు టీస్పూన్
  • ఆవాలు – ½ టీ స్పూన్
  •  అల్లంవెల్లుల్లి పేస్ట్ – టీస్పూన్
  • మెంతులు – చిటికెడు
  • ఉప్పు – రుచికి సరిపడా
  • నూనె – 2 టేబుల్ స్పూన్స్
  • కరివేపాకు – కొద్దిగా
  • జీలకర్ర – ½ టీ స్పూన్

👩‍🍳 తయారీ విధానం

🔪 స్టెప్ 1:

కందదుంపను ముక్కలుగా చేసుకుని ఉప్పు నీటిలో 5 నిమిషాలు నానపెట్టాలి.

🍳 స్టెప్ 2:

ఆ తరువాత దుంప ముక్కలను  ఉడికించాలి. (చాలా మెత్తగా కాకుండా చూసుకోవాలి)

🔥 స్టెప్ 3:

ఇప్పుడు కడాయిలో నూనె వేసి వేడి అయిన తరువాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేయాలి. కొంచెం వేగాక కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.

🧅 స్టెప్ 4:

ఆ తరువాత ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించాలి. ఇందులో పసుపు వేసి కలిపి, ఉడికించిన కందదుంప ముక్కలు వేసి 10 నిమిషాలు సిమ్‌లో ఉంచాలి.

🍲 స్టెప్ 5:

పడి నిముషాల తరువాత మిర్చి పొడి, ధనియాల పొడి, ఉప్పు, జీలకర మెంతుల పొడి వేసి కలపాలి. అందులోనే చింతపండు రసం, తగినంత నీరు పోసి మరిగించాలి.

🌿 స్టెప్ 6:

పులుసు కావలసినంత చిక్కగా అయిన తరువాత స్టౌ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.

🍽️ సర్వింగ్ సూచనలు

  • వేడి అన్నంతో + నెయ్యి → సూపర్ కాంబినేషన్ 😍
  • రాగి సంగటి తో కూడా బాగుంటుంది.

💡 టిప్స్

  • కందదుంపలో ఇచ్చింగ్ తగ్గడానికి ముందుగా ఉప్పు నీటిలో నానబెట్టాలి.
  • చింతపండు రసం బాలన్స్ గా ఉండాలి. (అతి పులుపు కాకుండా)
  • కొంచెం బెల్లం వేస్తే రుచి మరింత పెరుగుతుంది.