కావలసినవి:
• ఉడికించిన అన్నం – 2 కప్పులు
• నిమ్మరసం – 2 స్పూన్లు
• ఆవాలు – 1 స్పూన్
• శనగపప్పు – 1 స్పూన్
• ఎండుమిర్చి – 2
• పసుపు – చిటికెడు
• ఉప్పు – తగినంత
• నూనె – 2 స్పూన్లు
విధానం:
- పాన్లో నూనె వేడి చేసి ఆవాలు, పప్పులు వేయించండి
- ఎండుమిర్చి, పసుపు వేసండి
- అన్నం, ఉప్పు వేసి కలపండి
- చివరగా నిమ్మరసం కలపండి
